కాలువ భూసేకరణకు సహకరించాలి
కథలాపూర్: సూరమ్మ ప్రాజెక్టు కాలువల నిర్మాణానికి కావాల్సిన భూసేకరణకు రైతులు సహకరించాలని కోరుట్ల ఆర్డీవో జివాకర్‌రెడ్డి కోరారు. శనివారం మండలంలోని కలిగోటలో భూసేకరణపై గ్రామసభ నిర్వహించారు. గ్రామం పరిధిలో 48 ఎకరాలు కాలువ పనుల్లో పోతోందని, ఇందుకు గాను ప్రభుత్వం ఎకరా కు రూ.9.19లక్షల చొప్పున పరిహారం ఇచ్చేందుకు ప్రాథమికంగా నిర్ణయించిందని పేర్కొన్నారు. తాము భూమిని కోల్పోతున్నందున పరిహారం పెంచి ఇవ్వాలని రైతులు అధికారులకు విన్నవించారు. కార్యక్రమంలో తహసీల్దార్ వినోద్, ఆర్‌ఐ రవీందర్ పాల్గొన్నారు.
మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలి
జగిత్యాలరూరల్: గ్రామ పంచాయతీ కార్మికులకు మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలని పంచాయతీ ఎంప్లాయీస్ వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ) రాష్ట్ర ఉపాధ్యక్షుడు పులి మల్లేశం అన్నారు. జగిత్యాలరూరల్ ఎంపీడీవో కార్యాలయం ఆవరణలో విలేకరులతో మాట్లాడారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయాలని, జీవో నంబరు 51ను సవరించాలని డిమాండ్ చేశారు. 2025 జనాభా ప్రతిపాదికన ఇప్పటికే పనిచేస్తున్న వారి పేర్లను ఆన్‌లైన్‌లో నమోదు చేసి వేతనాలు ఇవ్వాలన్నారు. ప్రతినెలా గ్రీన్‌ఛానల్ ద్వారా వేతనాలు ఇస్తామని ఏడాది దాటిందని గుర్తు చేశారు. ఈనెల 17న జరిగే మంత్రివర్గ సమావేశంలో పంచాయతీ కార్మికుల డిమాండ్లను నెరవేర్చాలన్నారు.
లోక్ అదాలత్‌లో 1,579 కేసులు పరిష్కారం
జగిత్యాలజోన్: జిల్లా కేంద్రంలోని తొమ్మిది కోర్టులతోపాటు ధర్మపురి, కోరుట్ల, మెట్‌పల్లిలోని రెండు కోర్టుల్లో శనివారం నిర్వహించిన స్పెషల్ లోక్ అదాలత్‌లో 1579 కేసులు పరిష్కారమయ్యాయి. నాలుగు మోటారు వాహనాల కేసుల్లో బాధితులకు రూ.29 లక్షల పరిహారాన్ని ఇన్సూరెన్స్ సంస్థలు చెల్లించాలి. 2010లో వేసిన ఓ కేసులో 16 ఏళ్ల అనంతరం మోక్షం లభించింది.
కొనుగోలు కేంద్రం తనిఖీ
కొడిమ్యాల: మండలంలోని హిమ్మాత్‌రావుపేట ఐకేపీ కొనుగోలు కేంద్రాన్ని అడిషనల్ కలెక్టర్ బీఎస్.లత సందర్శించారు. ధాన్యం నాణ్యతతో తేవాలన్నారు. తేమశాతం వచ్చిన కుప్పలు ఎన్ని ఉన్నాయి..? మిల్లులకు ఎంత ధాన్యం పంపించారు..? వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఫుడ్ ఇన్స్‌పక్టర్ స్వామి, డీఎం సివిల్ సప్లై, జితేందర్ ప్రసాద్, ఆర్‌ఐ కరుణాకర్, ఏపీఎం మల్లేశం, సీసీ స్వరూప, వీవోఏ రమ, కమిటీ మెంబర్స్, రైతులు, మహిళలు ఉన్నారు.
కొనుగోళ్లు వేగవంతం చేయాలి
మల్యాల: ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలని అడిషనల్ కలెక్టర్ లత అన్నారు. కొండగట్టు, ముత్యంపేటలో కొనుగోలు కేంద్రాలను సందర్శించారు. రైతులకు 48గంటల్లో డబ్బులు జమ చేసేలా చర్యలు చేపట్టాలని నిర్వాహకులకు సూచించారు.
టీజీవోఎస్‌ల ఫోరం అధ్యక్షుడిగా చిరంజీవి
రాయికల్: తెలంగాణ ఎంపీడీవోల యూనియన్ అసోసియేషన్ జగిత్యాల జిల్లా అధ్యక్షుడిగా రాయికల్ ఎంపీడీవో చిరంజీవి, జనరల్ సెక్రటరీగా ప్రేమ్‌సాగర్ (పెగడపల్లి), కోశాధికారిగా రామకృష్ణ (కోరుట్ల), ఉపాధ్యక్షులుగా భీమేశ్ (బీర్‌పూర్), రమాదేవి (జగిత్యాలరూరల్), విజయలక్ష్మి (జగిత్యాల), జాయింట్ సెక్రటరిలుగా శ్రీకాంత్ (మల్లాపూర్), స్వరూప (కొడిమ్యాల), రవీందర్ (ధర్మపురి), ఆర్గనైజింగ్ సెక్రటరిలుగా వెంకట్ ప్రసాద్ (వెల్గటూర్), స్వాతి (మల్యాల), పబ్లిక్ సెక్రటరీగా శంకర్ (కథలాపూర్), ఈసీ మెంబర్లుగా అనుజమ (మేడిపల్లి),గణేశ్(ఇబ్రహీంపట్నం),సుమంత్ (బుగ్గారం), సురేశ్ (మెట్‌పల్లి)లు ఎన్నికై నట్లు ఎన్నికల అధికారి గౌతమ్‌రెడ్డి శనివారం తెలిపారు.
కాలువ భూసేకరణకు సహకరించాలి
కాలువ భూసేకరణకు సహకరించాలి
కాలువ భూసేకరణకు సహకరించాలి


