ఆధ్యాత్మికతతో మానసిక ప్రశాంతత
జెండా ఊపి పాదయాత్ర ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే సంజయ్ కుమార్
జగిత్యాలటౌన్: ఆధ్యాత్మిక భావనతో మానసిక ప్రశాంతత కలుగుతుందని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ అన్నారు. పెంబట్ల వాసవీకన్యకాపరమేశ్వరి ఆలయం వరకు పట్టణ వాసవీమాత భక్తులు చేపట్టిన పాదయాత్రను జెండా ఊపి ప్రారంభించారు. యువత చెడు అలవాట్లకు బానిస కాకుండా సరైన మార్గంలో నడవాలని సూచించారు. అనంతరం జిల్లాకేంద్రంలోని 25వ వార్డులో రూ.10.లక్షలతో చేపట్టిన డ్రైనేజీ, సీసీ రోడ్డు పనులను పరిశీలించారు. నాణ్యతతో చేయాలని సూచించారు.
దేశాయి బీడీ కంపెనీ ఎదుట కార్మికుల ఆందోళన
మెట్‌పల్లి: పట్టణంలోని దేశాయి బీడీ కంపెనీ యాజమాన్యం తీరును నిరసిస్తూ తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఆదివారం కార్మికులు ధర్నా నిర్వహించారు. జిల్లా ఉపాధ్యక్షురాలు సత్యక్క మాట్లాడుతూ కొంతకాలంగా యాజమాన్యం వెయ్యి బీడీలకు ఇవ్వాల్సిన మొత్తంలో రూ.10 కోత పెడుతోందన్నారు. కార్మికులకు నాసిరకం తినుబండారాలు విక్రయిస్తూ ఇబ్బంది పెడుతోందన్నారు. నాణ్య మైన ఆకు, తంబాకు, దారం సరఫరా చేయడం లేదన్నారు. కంపెనీ దోపిడీపై ప్రభుత్వం దృష్టి సారించి కార్మికులకు న్యాయం చేయాలని కోరారు. కార్యక్రమంలో రాధక్క, శ్యామల, వినీత, బాలయ్య, సునీత తదితరులున్నారు.
రంగారావుపేటలో ‘సీసీఎంబీ’ టీం
మెట్‌పల్లిరూరల్: మెట్‌పల్లి మండలం రంగా రావుపేట గ్రామాన్ని సెంటర్ ఫర్ సెల్యూలార్ అండ్ మాలిక్యూలర్ బయాలజీ(సీసీఎంబీ) టీం సభ్యులు ఆదివారం సందర్శించారు. దేశ వ్యాప్తంగా ఎక్కువ మంది పాముకాటుకు గురై మృతి చెందడంతోపాటు శాశ్వత వైకల్యంతో బాధపడుతుండడంపై సభ్యులు బాధితులను కలిసి వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. ఇందులో భాగంగా రంగారావుపేటలో పాము కాటు బాధితులను కలిశారు. వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఏమైనా అనారోగ్య సమస్యలు ఉన్నాయా..? అని జాగ్రత్తలు వివరించారు. మెట్‌పల్లి మండల వైద్యాధికారి అంజిత్‌రెడ్డి, సీసీఎంబీ చీఫ్ సైంటిస్ట్ కార్తికేయన్, సైంటిస్ట్ సుమిత్, శ్రీనివాస్, స్వప్నిల్, కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు.
ఆధ్యాత్మికతతో మానసిక ప్రశాంతత
ఆధ్యాత్మికతతో మానసిక ప్రశాంతత


