రైతులకు సరిపడా టార్పాలిన్లు కొనాలి
కథలాపూర్(వేములవాడ): సహకార సంఘాల్లో నిల్వ ఉన్న నిధులతో రైతులకు సరిపడా టార్పాలిన్ కవర్లు కొనుగోలు చేయాలని విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. గురువారం కథలాపూర్‌లో సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించి మాట్లాడారు. మొక్కజొన్నకు క్వింటాలుకు మద్దతు ధర రూ.2,400 ప్రభుత్వం చెల్లిస్తుందని, రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు అవసరమైన ఇసుకను ఉచితంగా అందించాలని అధికారులకు సూచించారు. అనంతరం గ్రామాలవారీగా సమస్యలపై స్థానిక నాయకులతో చర్చించారు. ఏఎంసీ చైర్మన్ నారాయణరెడ్డి, డైరెక్టర్లు ఎండీ హఫీజ్, వాకిటి రాజారెడ్డి, కారపు గంగాధర్, చౌదరి, కాంగ్రెస్ మండలాధ్యక్షుడు కాయితి నాగరాజు, నాయకులు చెదలు సత్యనారాయణ, తొట్ల అంజయ్య, మహేశ్, చిన్నారెడ్డి, మోహన్, రేహన్, అశోక్ పాల్గొన్నారు.


