మెనూ ప్రకారం భోజనం అందించాలి
మల్యాల(చొప్పదండి): విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందించాలని, లేకుంటే చర్యలు తీసుకుంటామని జిల్లా విద్యాధికారి కె.రాము హెచ్చరించారు. గురువారం మండలంలోని నూకపల్లి ప్రాథమిక పాఠశాల, మండల కేంద్రంలోని కస్తూరిబా పాఠశాలను ఆకస్మికంగా సందర్శించారు. కస్తూరిబా విద్యాలయంలో భోజనాన్ని పరిశీలించారు. విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను అడిగి తెలుసుకున్నారు. సీ గ్రేడ్ విద్యార్థుల వివరాలు సేకరించి, ప్రణాళిక ప్రకారం అభ్యసనా సామర్థ్యాలు పెంపొందించాలని సూచించారు. పదో తరగతి విద్యార్థులు పరీక్షల్లో ఉత్తమ మార్కులు సాధించి, తల్లిదండ్రుల ఆశలు నెరవేర్చాలన్నారు. ఎంఈవో జయసింహారావు, స్రవంతి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.


