అజాగ్రత్త..
న్యూస్‌రీల్
ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్
మెట్‌పల్లి మండలం బండలింగాపూర్ గండి హనుమాన్ ఆలయ సమీపం నుంచి మారుతినగర్ శివారులోని పెద్దగుండు వరకు సుమారు 15 కిలోమీటర్ల మేర జాతీయ రహదారి విస్తరించింది.
ఈ ప్రాంతంలోనే ఎక్కువగా ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి.
మారుతినగర్, ఆరపేటలోని చౌలమద్ది మూలమలుపు, శివాలయం మూలమలుపు, వెంకట్రావుపేట శివారులో కల్వర్టు, మేడిపల్లి శివారు ఇబ్రహీంపట్నం క్రాసింగ్, మేడిపల్లి బస్టాండ్, బండలింగాపూర్ మూలమలుపు, రాజేశ్వర్‌రావుపేట వరదకాల్వ బ్రిడ్జి ప్రాంతాల్లో ప్రమాదాలు జరుగుతున్నాయి.
వాహనాలను అతివేగంగా, అజాగ్రత్తగా నడపడం వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయి.
లారీలు, బస్సులు, కార్లు, ఇతరత్రా వేగంగా దూసుకెళ్తున్నాయి.
పోలీసులు అవగాహన కల్పిస్తున్నా.. జరిమానా విధిస్తున్నా వాహనదారుల్లో మార్పు రావడంలేదు.
ద్విచక్రవాహనదారులూ ఇందుకు అతీతులు కావడంలేదు.
మద్యం సేవించి వాహనాలను నడుపుతూ ప్రమాదాలను కొనితెచ్చుకుంటున్నారు.
పలుచోట్ల ప్రమాదకర మలుపులతోనూ ఘటనలు చోటుచేసుకుంటున్నాయి.
ఈ జాతీయ రహదారిపై రెండేళ్లలో 80కి పైగా ప్రమాదాలు జరిగాయి.
ఈ ప్రమాదాల్లో 30 మంది వరకు మృత్యువాత పడ్డారు. వందలాది మంది గాయాలతో బయటపడ్డారు.
వాహనదారులు ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ.. అప్రమత్తంగా ఉంటేనే ప్రమాదాలను నివారించవచ్చని పోలీసులు చెబుతున్నారు.
పసుపు రంగు ట్రాఫిక్ సిగ్నల్ లైట్లు (బ్లింకర్ లైట్స్) ఏర్పాటు చేయాలి
అప్రమత్తం చేసే సూచిక, హెచ్చరిక బోర్డులు పెట్టాలి
సింగిల్ లైన్‌తో కూడిన డివైడర్లు.. రాత్రిపూట మెరిసే రేడియం స్టిక్కర్లు వేయాలి
స్పీడ్ బ్రేకర్లతోపాటు అనుసంధాన రహదారుల వద్ద లైట్లు ఏర్పాటు చేయాలి
శుక్రవారం శ్రీ 24 శ్రీ అక్టోబర్ శ్రీ 2025
అతివేగం..
మేడిపల్లి శివారులోని ఇబ్రహీంపట్నం క్రాసింగ్ వద్ద ఆటోను ఢీకొన్న కారు (ఫైల్)
ఆలయ అభివృద్ధికి కృషి చేయాలి
మెట్‌పల్లి రూరల్: మెట్‌పల్లి మీదుగా విస్తరించిన 63వ జాతీయ రహదారి డేంజర్ బెల్స్ మోగిస్తోంది. తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటూ.. కొందరు చనిపోతున్నారు. మరికొందరు తీవ్రంగా గాయపడుతున్నారు. ఎదురెదురుగా కొన్ని.. వెనక నుంచి వచ్చి మరికొన్ని వాహనాలు ఢీకొంటుండడంతో ప్రమాదాల తీవ్రత పెరుగుతోంది. ఇంకొన్నిచోట్ల రాంగ్‌రూట్‌లో ప్రయాణం, మూలమలుపులు క్రాస్ చేస్తుండగా, అతివేగం, అజాగ్రత్తగా నడపడం వంటి కారణాలతో ప్రమాదాల బారిన పడుతున్నారు.
ఈ ప్రాంతాల్లోనే ఎక్కువ ప్రమాదాలు
ఇలా చేస్తే ప్రమాదాల నివారణ
అజాగ్రత్త..
అజాగ్రత్త..


