
మొదటి ప్రయత్నంలోనే సక్సెస్
కోరుట్ల: కష్టపడితే ఫలితం వస్తుందనేందుకు కోరుట్లకు చెందిన దురిశెట్టి విజయ్‌కుమార్ నిదర్శనం. పట్టణానికి చెందిన విజయ్ 177వ ర్యాంక్‌తో జైళ్లశాఖ డీఎస్పీగా ఎంపికయ్యారు. దురిశెట్టి సత్యనారాయణ–జమునారాణి దంపతులకు కూతురు, కుమారుడు. సత్యనారాయణ కోరుట్లలో జ్యూవెల్లరీ షాప్ నిర్వహిస్తుండగా... జమునారాణి గృహిణి. విజయ్‌కుమార్ పదోతరగతి వరకు కోరుట్ల, ఇంటర్ హైదరాబాద్, ఢిల్లీలోని ఎన్‌ఐటీలో బీటెక్(ఈసీఈ) పూర్తి చేశారు. గతేడాది గ్రూప్–4 పరీక్ష రాసి జూనియర్ అసిస్టెంట్‌గా ఎంపికై మెట్‌పల్లి ఆర్డీవో ఆఫీస్‌లో విధులు నిర్వర్తిస్తున్నారు. గ్రూప్–1 ఫలితాల్లో 177వ ర్యాంక్ సాధించి..జైళ్లశాఖ డీఎస్పీగా ఎంపికయ్యారు.
దురిశెట్టి విజయ్‌కుమార్