
కోచింగ్ ఇస్తూనే ఉద్యోగం సాధించి
ముస్తాబాద్(సిరిసిల్ల): ముస్తాబాద్ మండల కేంద్రానికి చెందిన మెన్నేని అనూష గ్రూప్–1లో రాష్ట్రస్థాయిలో 62వ ర్యాంక్‌తో జిల్లా పంచాయతీ ఽఅధికారిగా ఎంపికయ్యారు. ముస్తాబాద్‌కు చెందిన మెన్నేని జగన్‌మోహన్‌రావు కుమారుడు సంతోష్‌రావు సతీమణి అయిన అనూష బీటెక్ చదివి ఉస్మానియాలో ఎల్‌ఎల్‌బీ పూర్తి చేశారు. న్యాయవిద్యలో రెండు బంగారు పతకాలు సాధించిన అనూష.. డీపీవోగా ఎంపిక కావడంపై కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో భర్త సంతోష్‌రావుతో కలిసి కోచింగ్ సెంటర్లు నిర్వహిస్తున్నారు. ఎంతో మంది విద్యార్థులను పోటీపరీక్షలకు సిద్ధం చేస్తున్న అనూష డీపీవోగా ఎంపికయ్యారు.
అనూష