
ఎన్టీపీసీ యువకుడు.. గ్రూప్–1 విజేత
జ్యోతినగర్: ఎన్టీపీసీ రామగుండం ప్రాంతానికి చెందిన ముద్దసాని శ్రీరాంరెడ్డి గ్రూప్–1లో 144వ ర్యాంక్‌తో అసిస్టెంట్ ఎకై ్సజ్ సూపరింటెండెంట్‌గా ఎంపికయ్యారు. స్థానిక కృష్ణానగర్‌కు చెందిన ముద్దసాని శ్రీనివాసరెడ్డి–ఊర్మిల దంపతుల కుమారుడు ముద్దసాని శ్రీరాంరెడ్డి స్థానిక ఓ ప్రైవేట్ స్కూల్‌లో పాఠశాల విద్య, ఫిట్‌జీలో ఇంటర్ చదివారు. తాను పనిచేస్తున్న ప్రైవేట్ ఉద్యోగానికి రాజీనామా చేసి యూపీఎస్‌సీకి సిద్ధమవుతున్నారు. రెండోసారి యూపీఎస్‌ఈ మెయిన్స్ వరకు వెళ్లారు. ఈక్రమంలో గ్రూప్–1 ఫలితాలు వెలువడడంతో ఉద్యోగం సాధించారు.
శ్రీరాంరెడ్డి