
విద్యాసంస్థలు బంద్
జగిత్యాలటౌన్: విద్యారంగ సమస్యల పరిష్కరించాలని వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో చేపట్టిన బంద్ మేరకు విద్యాసంస్థలు మూసివేశారు. ఆర్‌ఎస్‌యూ, పీడీఎస్‌యూ, ఏఐఎస్‌ఎఫ్ విద్యార్థి సంఘాల పిలుపు మేరకు ప్రైవేట్ పాఠశాలలు తెరుచుకోలేదు. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలకు వెళ్లిన విద్యార్థి సంఘాలు బంద్‌కు సహకరించాలని కోరారు. దీంతో విద్యార్థులు క్లాసుల నుంచి వెళ్లిపోయారు. ఈ సందర్బంగా ఏఐఎస్‌ఎఫ్ నాయకుడు అక్రం మాట్లాడుతూ 25ఏళ్లుగా అటెండర్ ఉద్యోగాలు నియమించలేని దుస్థితిలో రాష్ట్ర విద్యాశాఖ ఉండటం శోచనీయమన్నారు. ఫీజు బకాయిల కారణంగా బెస్ట్ అవైలెబుల్ స్కూల్స్‌లో విద్యార్థులను అనుమతించడం లేదన్నారు. ఖాళీ పోస్టులు భర్తీ చేయాలని, ఇంటర్‌లో మధ్యాహ్న భోజనం అమలు చేయాలని, పెంచిన మెస్, కాస్మోటిక్ చార్జీలు అమలు చేయాలని కోరారు. ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థల్లో ఫీజులను నియంత్రించాలన్నారు.