
మెట్‌పల్లి క్లబ్‌ను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి
మెట్‌పల్లి: పట్టణంలోని మెట్‌పల్లి క్లబ్‌ను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు. క్లబ్ స్థలాన్ని విక్రయించడాన్ని నిరసిస్తూ బుధవారం క్లబ్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ క్లబ్‌కు చెందిన విలువైన స్థలాన్ని కొందరు సభ్యులు గుట్టుగా విక్రయించి పెద్ద మొత్తంలో లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వం దీనిని తక్షణమే స్వాధీనం చేసుకుని ప్రజా అవసరాలకు వినియోగించాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు యామ రాజయ్య, సంగు గంగాధర్, రైసుద్దీన్, పెంట ప్రణయ్, పల్లికొండ ప్రవీణ్, లతీఫ్, రుడావత్ గణేష్ తదితరులున్నారు.