
వ్యయం తక్కువ.. రవాణా సులభం
రామగుండం: విద్యుత్ ఉత్పత్తికి అవసరమైన బొగ్గు, నీరు, ఇతర ఖనిజాలు స్థానికంగానే అభ్యమయ్యే అవకాశాలు పుష్కలంగా ఉండడంతో రామగుండంలో పిట్ హెడ్ థర్మల్ పవర్ ప్లాంట్ స్థాపించేందుకు ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది. బొగ్గు గనులు, గోదావరినది, ఖనిజాల లభ్యత అధికంగా ఉండడంతోనే సుమారు 70 ఏళ్ల క్రితం రామగుండంలో 14.5 మెగావాట్ల విద్యుత్ కేంద్రం స్థాపించారు. ఆ తర్వాత 62.5 మెగావాట్ల బీ – థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మించిన సంగతి తెలిసింది. ఇది ఐదు దశాబ్దాలు నడిచి ఏడాదిన్నర క్రితం మూతపడింది. పిట్ హెడ్ ద్వారా సమీపంలోని గనుల ద్వారా తక్కువ ధరకు నాణ్యమైన బొగ్గు రవాణా చేస్తే వ్యయం భారీగా తగ్గుతుంది. అంతేకాదు.. వనరుల లభ్యత ఆధారంగా విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం పెంచే వీలుకూడా ఉంటుంది. అంతేకాదు.. విద్యుత్ ఉత్పత్తి యూనిట్ ఖర్చు తగ్గితే ప్లాంట్ యాజమాన్యంతోపాటు కరెంట్ కొనుగోలు చేసే కంపెనీలకూ తక్కువ ధరకే అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. రామగుండంలో అన్ని వనరులు అందుబాటులో ఉండడంతో త్వరలోనే 800 మెగా వాట్ల పవర్ ప్లాంట్ నిర్మించేందుకు సర్కారు నిర్ణయించినట్లు తెలిసింది.
ఇంజినీర్ల సంఘాలతోనే ఆలస్యం..
ఆర్థిక సమస్యలతో 800 మెగావాట్ల పిట్‌హెడ్ పవర్ ప్లాంట్ నిర్మాణ బాధ్యతలు సింగరేణికి అప్పగించాలని ప్రభుత్వం తొలుత నిర్ణయించింది. అయితే జెన్‌కోకు ఆ బాధ్యతలు అప్పగించాలని ఇంజినీర్లు ఆందోళనలు చేశారు. దీంతో జెన్‌కోకు అప్పగించేందుకు సర్కారు నిర్ణయించింది. ఒకవేళ సింగరేణికి బాధ్యతలు అప్పగిస్తే మూడు నెలల క్రితమే రామగుండంలో కొత్త విద్యుత్ కేంద్రం స్థాపనకు శంకుస్థాపన చేసేవారు.
రామగుండంలో 800 మెగావాట్ల థర్మల్ పవర్ ప్లాంట్
స్థానికంగా బొగ్గు, నీరు, ముడి పదార్థాలు లభించడమే కారణం
కార్యాచరణ సిద్ధం
రామగుండంలో మూతపడిన బీ– థర్మల్ పవర్ ప్లాంట్ స్థానంలో 800 మె గావాట్ల సామర్థ్యంతో కొత్త విద్యుత్ కేంద్రం స్థాపనకు ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు కార్యాచరణ సిద్ధం చేయాలని మంత్రి భట్టి విక్రమార్క ఎనర్జీ అధికారి, జెన్‌కో డైరెక్టర్లకు సూచించింది. సీఎండీ హరీశ్‌తోనూ ఇదే విషయంపై ఇటీవల చర్చించాం.
– మక్కాన్‌సింగ్‌ఠాకూర్, ఎమ్మెల్యే, రామగుండం

వ్యయం తక్కువ.. రవాణా సులభం