
అన్ని వసతులు
కళాశాలలో విద్యార్థులకు సరిపడా అన్ని మౌలిక వసతులున్నాయి. కొత్త కోర్సులతో పాటు, డిజిటల్ లైబ్రరీ, దోస్త్, హెల్ప్‌లైన్, టాస్క్ సెంటర్లు సైతం ఉన్నాయి. అనుభవజ్ఞులైన లెక్చరర్లు ఉన్నారు. 60 ఏళ్లు పూర్తి చేసుకోవడం ఎంతో అభినందనీయం.
– అశోక్, ఎస్‌కేఎన్‌ఆర్ కళాశాల ప్రిన్సిపల్
గొప్ప కళాశాల
ఒకప్పుడు ఈ కళాశాలలో సీటు దొరకాలంటే ఎంతో ప్రయత్నం చేయాల్సి ఉండేది. 32 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ కాలేజీలో గ్రీనరే కాకుండా మౌలిక వసతులన్నీ ఉన్నాయి. విద్యార్థులకు మెరుగైన విద్య అందుతుంది. ఎన్‌సీసీతో పాటు, లైబ్రరీ, ఇలా ఎన్నో ఉన్నాయి.
– సంజయ్‌కుమార్, జగిత్యాల ఎమ్మెల్యే
గుర్తుకొస్తున్నాయి
ఈ కళాశాలలో గతంలో చదువుకున్న రోజులు గుర్తుకువస్తున్నాయి. కాలేజీని మరింత అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది. 60 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా వేడుకలు ఘనంగా నిర్వహించుకునేలా చూస్తాం.
– రమణ, ఎమ్మెల్సీ

అన్ని వసతులు

అన్ని వసతులు