
రెండురోజులు భగీరథ నీటి సరఫరా నిలిపివేత
జగిత్యాల: మెట్‌పల్లి మండలం వెంకట్రావ్‌పేట గ్రామ సమీపంలో మిషన్ భగీరథ పైప్‌లైన్ లీకేజీ కారణంగా జిల్లాలో రెండురోజుల పాటు నీటి సరఫరా నిలిపివేస్తున్నట్లు భగీరథ గ్రిడ్ డివిజన్ ఇంజనీరింగ్ అధికారి శేఖర్‌రెడ్డి తెలిపారు. పైప్‌లైన్ మరమ్మతు కారణంగా ఈనెల 12,13 తేదీల్లో నీటి సరఫరా ఉండదన్నారు. జగిత్యాల, కోరుట్ల, ధర్మపురి నియోజకవర్గంలోని (వెల్గటూర్, ధర్మారం, ఎండపల్లి మండలాలను మినహాయించి) మున్సిపాలిటీలకు భగీరథ నీటిని నిలిపివేయడం జరుగుతుందని, ప్రజలు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని కోరారు.