కరీంనగర్‌రూరల్: కరీంనగర్‌రూరల్ పోలీసులు ఇసుక అక్రమార్కులపై ఉక్కుపాదం మోపారు. మంగళవారం అక్రమంగా ఇసుకను తరలిస్తున్న 11 ట్రాక్టర్లను పట్టుకున్నారు. 11మంది ట్రాక్టర్ యజమానులు, డ్రైవర్లపై కేసు నమోదు చేసికోర్టులో హాజరుపరిచారు. కరీంనగర్‌రూరల్ సీఐ నిరంజన్‌రెడ్డి వివరాల మేరకు.. సుల్తానాబాద్ మండలం గొల్లపల్లి మానేరు వాగునుంచి ఇసుక అక్రమంగా రవాణా చేస్తున్న ఆరు ట్రాక్టర్లను మొగ్ధుంపూర్ శివారులో ఎస్సై నరేశ్ ఆధ్వర్యంలో పట్టుకున్నారు. గొల్లపల్లికి చెందిన కొత్తూరి రమేశ్, వంశీ, దర్శనాల మహేశ్, రాజు, బేతి సునీల్‌రెడ్డి, ఎలవేణి రమేశ్‌బాబును అరెస్టు చేశారు. చేగుర్తి మానేరు వాగునుంచి ఇసుక అక్రమ రవాణా చేస్తున్న ఐదు ట్రాక్టర్ల యజమానులు, డ్రైవర్లు దుర్గం చంద్రమోహన్, ఎల్కపల్లి నవీన్, శీలం సురేశ్, పోతర్ల క్రాంతికుమార్‌ను బొమ్మకల్ ఫ్లైఓవర్ బ్రిడ్జి వద్ద పట్టుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. మొత్తం 11మంది యజమానులు, డ్రైవర్లను కోర్టులో హాజరుపరిచినట్లు సీఐ నిరంజన్‌రెడ్డి తెలిపారు. ఇసుక అక్రమ రవాణాదారులపై చట్టప్రకారం కఠిన చర్యలు చేపడుతామని హెచ్చరించారు.
11 ట్రాక్టర్లు పట్టివేత.. యజమానులపై కేసు