
సీఎంకు తెలంగాణపై కమిట్‌మెంట్ లేదు
● బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయాలే ప్రజలకు జనతా గ్యారేజ్ ● నాయకులు, కార్యకర్తలను వేధిస్తే ఐక్య పోరాటాలు ● స్థానిక సంస్థల్లో అన్ని స్థానాలూ గెలుచుకుందాం ● కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్, బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు విద్యాసాగర్‌రావు
మల్లాపూర్: సీఎం రేవంత్‌రెడ్డికి తెలంగాణ పట్ల కమిట్‌మెంట్ లేదని, ఆయనలో కంటెంట్ కూడా లేదని బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు, ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ అన్నారు. మండలకేంద్రంలో గురువారం బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయాన్ని రాష్ట్ర నాయకులు ఆర్‌ఎస్.ప్రవీణ్‌కుమార్, ఎమ్మెల్సీ ఎల్.రమణతో కలిసి ప్రారంభించారు. అనంతరం కార్యకర్తలతో సమావేశమయ్యా రు. బీఆర్‌ఎస్ పాలనలో నంబర్‌వన్‌గా ఉన్న రాష్ట్రాన్ని సీఎం రేవంత్ రెడ్డి అవినీతిమయం చేశారని విమర్శించారు. గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు కాంగ్రెస్ నాయకులు అందినకాడికి దోచుకుంటున్నారన్నారు. పథకాల లబ్ధిదారులను డబ్బు ల కోసం బెదిరింపులకు పాల్పడుతున్నారని విమర్శించారు. బీఆర్‌ఎస్ నాయకులను భయపెట్టి, ప్రలోభాలకు గురిచేసి కాంగ్రెస్‌లోకి చేర్చుకుంటున్నారని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో నాయకులు, కార్యకర్తలతో కలిసి పనిచేద్దామన్నారు. అధి కార పార్టీ నాయకుల దాడులు, వేధింపులకు దిగితే తామే నిలబడి కోట్లాడుతామని భరోసా ఇచ్చారు. అర్హులకు ఏ పథకం అందకున్నా.. కలెక్టరేట్‌ను ము ట్టడిద్దామన్నారు. జెడ్పీ మాజీ చైర్మన్ దావ వసంత, మార్క్‌ఫెడ్ మాజీ చైర్మన్ లోక బాపురెడ్డి, ఖానా పూర్ బీఆర్‌ఎస్ ఇన్‌చార్జి భూక్య జాన్సన్‌నాయక్, బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు తోట శ్రీనివాస్, పట్టణ అధ్యక్షుడు బండి లింగస్వామి, మాజీ జెడ్పీటీసీ సందిరెడ్డి శ్రీనివాస్, మాజీ ఎంపీపీ కాటిపెల్లి సరోజన, మాజీ వైస్ ఎంపీపీ నాగేష్ పాల్గొన్నారు.
గురుకులం పాఠశాలను
సందర్శించిన ప్రవీణ్‌కుమార్
మెట్‌పల్లి: పట్టణంలోని సాంఘిక సంక్షేమ బాలికల గురుకులాన్ని ఆర్‌ఎస్.ప్రవీణ్‌కుమార్ ఎమ్మెల్యేతో కలిసి సందర్శించారు. పాఠశాలలో సమస్యలపై సిబ్బంది, విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. విద్యుత్ కోతలతో ఇబ్బందులు పడుతున్నామని విద్యార్థులు వివరించగా.. తానే స్వయంగా జనరేటర్‌ను సమకూరుస్తానని ఎమ్మెల్యే తెలిపారు.