వర్షాలు బాగా కురువాలని.. | - | Sakshi
Sakshi News home page

వర్షాలు బాగా కురువాలని..

Jun 28 2025 5:49 AM | Updated on Jun 28 2025 7:37 AM

వర్షా

వర్షాలు బాగా కురువాలని..

ఇబ్రహీంపట్నం: వర్షాలు బాగా కురువాలని, పంటలు మంచిగా పండాలని కోరుతూ మండలంలోని అమ్మక్కపేట, కోమటికొండాపూర్‌, వేములకుర్తి గ్రామాల్లో శుక్రవారం కుల సంఘాల ఆధ్వర్యంలో గ్రామదేవతలకు పూజలు చేశారు. కోమటికొండాపూర్‌లో గ్రామశివారులోని 2కిలోమీటర్ల దూరంలో ఉన్న గోదావరి నది వద్దకు వెళ్ల్లి గోదావరి జలాలను పోతరాజుల విన్యాసాలతో ఊరేగింపుగా తీసుకొచ్చి గ్రామదేవతలకు జలాభిషేకం చేసి మొక్కులు చెల్లించుకున్నారు. వేములకుర్తిలో పోతరాజుల విన్యాసాలతో వలకట్టు డప్పు చప్పుళ్లతో తాతమ్మకు, అమ్మవారికి నైవేద్యాలు సమర్పించారు. ఆయా గ్రామాల కుల సంఘాల సభ్యులు పాల్గొన్నారు.

వర్షాలు బాగా కురువాలని..
1
1/1

వర్షాలు బాగా కురువాలని..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement