
రాత పరీక్షకు ఏర్పాట్లు పూర్తి
జగిత్యాల: గ్రామ పరిపాలన అధికారుల రాత పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. శనివారం మాట్లాడుతూ.. పరీక్ష కేంద్రాల వద్ద ఏర్పాట్లు చేశామని, ఇబ్బంది లేకుండా అభ్యర్థులు పరీక్షలు రాసేలా చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు. ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 1.30 వరకు పరీక్ష నిర్వహిస్తామని తెలిపారు. అదనపు కలెక్టర్ లత, అధికారులు పాల్గొన్నారు.
విద్యార్హత నిబంధనతో పరీక్షకు దూరం
గ్రామ పరిపాలన అధికారుల రాత పరీక్షకు డిగ్రీ, ఐదేళ్ల సర్వీస్, ఇంటర్ విద్యార్హత పెట్టారని, పాత సర్వీస్‌ను పరిగణనలోకి తీసుకోబోమని స్పష్టం చేయడంతో జిల్లాలో చాలామంది పూర్వ వీఆర్‌ఏలు, వీఆర్వోలు పరీక్షకు దూరమవుతున్నారని వీఆర్‌ఏల సంఘం గౌరవ అధ్యక్షుడు హరి అశోక్‌కుమార్ అన్నారు. వీఆర్‌ఏ, వీఆర్వోలు విద్యార్హత లేని కారణంగా జీపీవో పరీక్షకు దూరమయ్యారని, ఎలాంటి ప్రశ్నలు అడుగుతారో.. సిలబస్ ఏంటో తెలియక ఇబ్బంది పడుతున్నారని వివరించారు.