రోడ్డు ప్రమాదంలో వృద్ధుడు మృతి | - | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో వృద్ధుడు మృతి

May 25 2025 8:06 AM | Updated on May 25 2025 8:06 AM

రోడ్డ

రోడ్డు ప్రమాదంలో వృద్ధుడు మృతి

పాలకుర్తి(రామగుండం): పుట్నూర్‌ గ్రామంలో టాటామ్యాజిక్‌ ఆటో ఢీకొని శ్రీరాముల మల్లయ్య(60) మృతిచెందాడు. స్థానికుల కథనం ప్రకారం.. ధర్మారం మండలం రామయ్యపల్లికి చెందిన టాటామ్యాజిక్‌ వాహనం బసంత్‌నగర్‌ వైపు వస్తుండగా మార్గమధ్యంలో పుట్నూర్‌ గ్రామశివారులోని గాంధీనగర్‌ వద్ద రహదారిపై నడుచుకుంటూ వెళ్తున్న మల్లయ్యను వెనుకనుంచి వేగంగా ఢీకొట్టింది. దీంతో మల్లయ్య తలకు తీవ్రగాయాలు కాగా వెంటనే పెద్దపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో కరీంనగర్‌ తీసుకెళ్తుండగా మార్గమధ్యంలోని సుల్తానాబాద్‌లో మల్లయ్య మృతిచెందాడు. మృతుడి బంధువుల ఫిర్యాదు మేరకు బసంత్‌నగర్‌ పోలీసులు కేసునమోదు చేసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పెద్దపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

రోడ్డు ప్రమాదంలో గుర్తుతెలియని మహిళ మృతి

ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): మండలంలోని వెంకటా పూర్‌ శివారులో రోడ్డు వెంట నడుచుకుంటూ వెళ్తున్న గుర్తు తెలియని మహిళను స్కూటీ బలంగా ఢీకొట్టడంతో మృతిచెందింది. ఎస్సై లక్ష్మణ్‌ తెలిపిన వివరాలు. వెంకటాపూర్‌లోని సిరిసిల్ల– కామారెడ్డి రహదారిపై నడుచుకుంటూ వెళ్తున్న గుర్తు తెలియని మహిళను ఎల్లారెడ్డిపేట నుంచి సిరిసిల్లకు వెళ్లున్న స్కూటీ శుక్రవారం రాత్రి ఢీ కొట్టింది. తీవ్రంగా గాయపడ్డ మహిళను అదే గ్రామానికి చెందిన వాటర్‌పంపు మెకానిక్‌ మల్లాపురం వెంకటేశ్‌, అతని స్నేహితుడు మేకల మల్లయ్య సిరిసిల్ల ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం మృతి చెందింది. ఈ సంఘటనపై వెంకటేశ్‌, మల్లయ్య ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై లక్ష్మణ్‌ తెలిపారు.

బైక్‌ ఢీకొని వృద్ధుడి మృతి

సిరిసిల్లక్రైం: రెండు ద్విచక్రవాహనాలు ఢీకొన్న సంఘటనలో నర్ర బుచ్చయ్య(60) మృతిచెందాడు. స్థాని కుల కథనం ప్రకారం.. బెటాలియన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న వ్యక్తి అతివేగంగా వెళ్తూ ఎక్సెల్‌ వాహనాన్ని ఢీకొట్టాడు. ఎక్సెల్‌పై వెళ్తున్న బుచ్చయ్య తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే సిరిసిల్ల ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో కరీంనగర్‌ తీసుకెళ్లగా మృతిచెందాడు. మృతికి కారణమైన పీసీ బాధిత కుటుంబంతో సంప్రదింపులు జరిపినట్లు స్థానికులు తెలిపారు.

రోడ్డు ప్రమాదంలో   వృద్ధుడు మృతి 1
1/2

రోడ్డు ప్రమాదంలో వృద్ధుడు మృతి

రోడ్డు ప్రమాదంలో   వృద్ధుడు మృతి 2
2/2

రోడ్డు ప్రమాదంలో వృద్ధుడు మృతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement