
యూరియాను మోతాదుకు మించి వాడుతున్నారు
జగిత్యాలఅగ్రికల్చర్: రైతులు అవసరం ఉన్నా, లేకున్నా ఒక్కరిని చూసి మరొకరు మోతాదును మించి యూరియాను వాడుతున్నారని వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ సైదానాయక్ అన్నారు. జగిత్యాల రూరల్ మండలంలోని పొలాస వ్యవసాయ కళాశాల ప్రొఫెసర్ల బృందం శుక్రవారం రాయికల్ మండలం రామోజిపేటలో నిర్వహించిన రైతు అవగాహన సదస్సులో మాట్లాడారు. వానాకాలంలో ఓ పంట వేస్తే, యాసంగిలో మరో పంట వేయాలని సూచించారు. పంట మార్పిడి చేయడం వల్ల రైతులకు సాగు ఖర్చులు తగ్గి, దిగుబడులు పెరుగుతాయని తెలిపారు. తెగుళ్ల, పురుగుల బెడద ఉండదన్నారు. అవసరం మేరకు మాత్రమే పంటలకు నీటిని ఇవ్వాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ ప్రొపెసర్లు డాక్టర్ శేషు, డాక్టర్ సతీ శ్, ఏఈవో పద్మావతి, రైతులు పాల్గొన్నారు.
పాఠశాలల బలోపేతానికి కృషి చేయాలి
గొల్లపల్లి: ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ఉపాధ్యాయులు కృషి చేయాలని డీఈవో రాము అన్నారు. శుక్రవారం గొల్లపల్లి మండల కేంద్రంలో జరుగుతున్న ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుల శిక్షణ తరగతులను పరిశీలించారు. పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచి మెరుగైన విద్యాబోధన అందించాలని సూచించారు. ఆయన వెంట స్టేట్ అబ్జర్వర్ దుర్గాప్రసాద్, ఎంఈవో జమునదేవి, ఉపాధ్యాయులు, ఆర్పీలు, సీఆర్పీలు పాల్గొన్నారు.

యూరియాను మోతాదుకు మించి వాడుతున్నారు