
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
జగిత్యాల: భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, లోతట్టు ప్రాంతాల వారు సుస్థిర ప్రాంతాలకు వెళ్లాలని మున్సిపల్ కమిషనర్ స్పందన అన్నారు. శుక్రవారం జగిత్యాలలోని బుడిగజంగాల కాలనీ తో పాటు తదితర కాలనీలను పరిశీలించారు. లోతట్టు ప్రాంతమైన బుడిగజంగాల కాలనీలో ఇళ్లలోకి వర్షం నీరు రావడంతో వారికి దగ్గరలోని ప్రైమరీ పాఠశాలల్లో తాత్కాలిక నివాసం కల్పించినట్లు తెలిపారు. అనంతరం జేసీబీల సహాయంతో నిలిచిన వర్షం నీటిని తొలగించామన్నారు. ఆమె వెంట శానిటరీ ఇన్‌స్పెక్టర్లు మహేశ్వర్‌రెడ్డి, శ్రీనివాస్ ఉన్నారు.
జిల్లాలో భారీ వర్షం
జగిత్యాలఅగ్రికల్చర్: జిల్లాలో రెండు రోజులుగా భారీ వర్షం కురుస్తోంది. శుక్రవారం జగిత్యాలలో 88.0 మి.మీ, మేడిపల్లిలో 86.8, జగిత్యాలరూరల్ మండలం పొలాసలో 76.8, బీమారం మండలం గోవిందారంలో 65.3, ఎండపల్లి మండలం గుల్లకోటలో 58.0, మల్యాల మండలం మద్దుట్లలో 58.0, కథలాపూర్ మండలం 50.5, వెల్గటూర్ మండలంలో 48.5, మల్యాలలో 46.3, కోరుట్లలో 45.0, ధర్మపురి మండలం నేరెల్లలో 43.5 మి.మీ వర్షపాతం నమోదైంది.