
ఆందోళన వద్దు.. ఆదుకుంటాం
జగిత్యాల అగ్రికల్చర్/సారంగాపూర్: అకాల వర్షాలతో తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తాం,.. రైతులు ఎలాంటి ఆందోళన చెందవద్దని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ అన్నారు. జగిత్యాల రూరల్ మండలంలోని చల్‌గల్, తిప్పన్నపేట, సారంగాపూర్ మండలం కోనాపూర్, పెంబట్ల గ్రామాల్లో అకాల వర్షాలతో తడిసిన ధాన్యాన్ని శుక్రవారం పరిశీలించారు. తడిసిన ధాన్యం కొనుగోలుపై కలెక్టర్‌తో మాట్లాడటం జరిగిందని, కొనుగోలుకు సంసిద్ధత వ్యక్తం చేశారని తెలిపారు. ఎమ్మెల్యే వెంట తహసీల్దార్ శ్రీనివాస్, సింగిల్‌విండో చైర్మన్లు మహిపాల్ రెడ్డి, మల్లారెడ్డి, మాజీ మార్కెట్ చైర్మన్ దామోదర్‌రావు, నాయకులు రవీందర్ రెడ్డి, పెండెం రాములు, బాల ముకుందం, కోల శ్రీనివాస్, నారాయణ, సీఈఓ వేణు ఉన్నారు.