
యూరియా తక్కువగా వినియోగించాలి
రాయికల్: రైతులు తమ పంటలకు యూరి యాను తక్కువగా వినియోగించాలని పొలాస శాస్త్రవేత్త పద్మజ, మధుకర్ తెలిపారు. మండలంలోని భూపతిపూర్ రైతువేదికలో ‘రైతు ముగింట్లో శాస్త్రవేత్తలు’ కార్యక్రమాన్ని నిర్వహించారు. యూరియా తక్కువ వాడటం, పంట మార్పిడి, సాగునీరు పొదుపు, నాణ్యమైన విత్తనాల ఎంపికపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ ముత్యంరెడ్డి, ఏవో ముక్తేశ్వర్, హర్టికల్చర్ ఆఫీసర్ స్వాతి, ఏఈవో పద్మావతి పాల్గొన్నారు.
ధాన్యం కొనుగోలులో వేగం పెంచాలి
పెగడపల్లి: ధాన్యం కొనుగోలులో వేగంపెంచి సకాలంలో పూర్తయ్యేలా చూడాలని డీసీఓ మనోజ్‌కుమార్ అన్నారు. మండలంలోని బతికపల్లిలో సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంగళవారం సందర్శించారు. కేంద్రంలోని నిల్వలను పరిశీలించారు. వసతులపై ఆరా తీశారు. తేమశాతం వచ్చిన ధాన్యం వెంటనే తూకం చేసి మిల్లర్లకు తరలించాలని, రైతుల వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని సిబ్బందికి సూచించారు. ఏఎంసీ చైర్మన్ రాములుగౌడ్, తహసీల్దార్ రవీందర్, డైరెక్టర్లు శ్రీనివాస్‌గౌడ్, విజయభాస్కర్, సీఈవో గోపాల్‌రెడ్డి పాల్గొన్నారు.
పునరావాస సహాయం అందించండి
● కలెక్టర్‌ను కలిసిన మాజీ మావోయిస్టు వసంత
జగిత్యాల/కోరుట్ల: పునరావాసం కోసం సహాయం అందించాలని ఛత్తీస్‌గఢ్ కాంకేర్ జిల్లా బస్తర్ డివిజన్ ఏరియాలో మావోయిస్టు కార్యదర్శిగా విధులు నిర్వర్తించిన మమత అలియాస్ వసంత కాంగ్రెస్ కోరుట్ల నియోజకవర్గ ఇన్‌చార్జి నర్సింగరావుతో కలిసి కలెక్టర్ సత్యప్రసాద్‌ను కలిసి వినతిపత్రం అందించారు. ఇటీవలే జనజీవన స్రవంతిలో కలిసిన తాను స్వస్థలమైన కోరుట్లకు వచ్చి జీవిస్తున్నానని, జీవనోపాధికి సహాయం అందించాలని, తన కుమార్తె విద్యకు తగిన ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని కోరారు. తనకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయించాలని కోరారు.
పంట నష్టంపై అంచనాలు రూపొందించాలి
సారంగాపూర్: అకాలవర్షాలకు నష్టపోయిన పంటలను పరిశీలించి అంచనాలు రూపొందించాలని మాజీమంత్రి జీవన్‌రెడ్డి వ్యవసాయ అధికారులకు సూచించారు. బీర్‌పూర్ మండలం తుంగూర్, కొల్వాయి, రేకులపల్లి గ్రామాల్లో పర్యటించారు. నష్టపోయిన పంటలను కోతకు వచ్చిన పంటలపై వడగళ్ల వాన కురవడంతో తీవ్ర నష్టం వాటిల్లిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన వెంట సింగిల్‌విండో చైర్మన్ పొల్సాని నవీన్‌రావు, మాజీ ఎంపీపీ మసర్తి రమేశ్, మాజీ జెడ్పీటీసీ ముక్క శంకర్, పార్టీ జిల్లా కార్యదర్శి గుడిసె జితేందర్, బీర్‌పూర్, సారంగాపూర్ మండల అధ్యక్షులు చెర్పూరి సుభాష్, కోండ్ర రాంచంద్రారెడ్డి ఉన్నారు. గొర్రెలు ఆరోగ్యంగా ఎదగడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలి అని మాజీ మంత్రి జీవన్‌రెడ్డి ప్రశ్నించారు. బట్టపల్లి గ్రామంలో ఆయన మర్రిపల్లి గంగయ్య గొర్ల షెడ్డులో చేపట్టిన గొర్రెలను పరిశీలించి, గొర్ల పెంపకంపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.

యూరియా తక్కువగా వినియోగించాలి

యూరియా తక్కువగా వినియోగించాలి

యూరియా తక్కువగా వినియోగించాలి