
పాలన సౌలభ్యం కోసమే కొత్త పంచాయతీలు
సారంగాపూర్: పాలన సౌలభ్యం కోసమే నూతన పంచాయతీలను ఏర్పాటు చేసినట్లు ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు. గొండుగూడెంలో రూ.20 లక్షలతో పంచాయతీ భవన నిర్మాణానికి భూమి పూజ చేశారు. మంగేళలో ఎస్సీ సబ్‌ప్లాన్ నిధులు రూ.5 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణ పనులు, శ్రీరామలింగేశ్వర ఆలయం పనులకు భూమిపూజ చేశారు. రూ.20 లక్షలతో నిర్మాణం చేసిన సీసీ రోడ్డును పరిశీలించారు. చిత్రవేణిగూడెంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను పరిశీలించి లబ్ధిదారులతో మాట్లాడారు. కేడీసీసీ బ్యాంక్ డైరెక్టర్లు ముప్పాల రాంచందర్‌రావు, మందాటి సాగర్, ఎంపీడీవో లచ్చాలు, డెప్యూటీ డీఎంహెచ్‌వో శ్రీనివాస్, డీఈ మిలింద్, మాజీ వైస్ ఎంపీపీ బల్మూరి లక్ష్మణ్‌రావు ఉన్నారు.