పైలెట్ ప్రాజెక్టుగా ‘ఇబ్రహీంపట్నం’
ఇబ్రహీంపట్నం: భూ భారతి చట్టం అమలుకు రాష్ట్రంలో నాలుగు మండలాలు ఎంపికయ్యాయని జూన్ 2 తర్వాత జిల్లాకు ఒకటి ఎంపిక చేస్తామని ఇందులో ఇబ్రహీంపట్నం మండలాన్ని ప్రదిపాదిస్తామని కలెక్టర్ సత్యప్రసాద్ పేర్కొన్నారు. మండలకేంద్రంలోని రైతు వేదికలో గురువారం భూ భారతి చట్టంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ సత్య ప్రసాద్ మాట్లాడుతూ.. మళ్లీ వీఆర్‌వో, వీఆర్‌ఏ వ్యవస్థ వచ్చే అవకాశం ఉన్నందున గ్రామస్థాయిలో భూ సమస్యల పరిష్కరం సులభతరం అవుతుందని తెలిపారు. రెవెన్యూ రికార్డులు అన్నీ ఇక నుంచి ప్రజల ముందు ఉంటాయని స్పష్టం చేశారు. 14 నెలలుగా భూ భారతి చట్టాన్ని తీసుకొచ్చేందుకు పకడ్బందీగా సర్వే చేసినట్లు వివరించారు. వీఆర్‌వో, వీఆర్‌ఏలు లేకపోవడంతో రైతుల భూ సమస్యలను గుర్తించేందుకు తహసీల్దార్లకు ఇబ్బందిగా ఉండేదన్నారు. భూ భారతి చట్టంతో గ్రామస్థాయిలోనే సమస్యలు పరిష్కారం అవుతాయని, తహసీల్దార్‌కు అప్పీల్ చేసుకోవచ్చునని, సమస్య పరిష్కారం కాకుంటే ఆర్‌డీవోకు అప్పీల్ చేసుకోవచ్చునని, అక్కడి నుంచి కలెక్టర్‌కు, కోర్టు వరకు వెళ్లవచ్చని తెలిపారు. సాదాబైనామా దరఖాస్తులు పరిష్కరించడం జరుగుతుందని తెలిపారు. మెట్‌పల్లి ఆర్‌డీవో శ్రీనివాస్, తహసీల్దార్ ప్రసాద్, ఎంపీడీవో చంద్రశేఖర్, ఎంపీవో రామకృష్ణరాజు, మార్కెట్ కమిటీ చైర్మన్ బోరిగం రాజు, ఆర్‌ఐలు రేవంత్‌రెడ్డి, రమేశ్ పాల్గొన్నారు.
భూ భారతితో సమస్యలు పరిష్కారం
బుగ్గారం: భూ సమస్యల పరిష్కారానికే భూ భారతి చట్టాన్ని ప్రభుత్వం తీసుకొచ్చిందని కలెక్టర్ సత్య ప్రసాద్ పేర్కొన్నారు. బుగ్గారంలో గురువారం రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. భూ భారతితో మ్యూటేషన్లు 30రోజుల్లో ఆటోమేటిక్‌గానే అవుతాయన్నారు. నూతన చట్టంలో పొందుపరిచిన ముఖ్య విషయాలను కలెక్టర్ రైతులకు వివరించారు. ఆర్డీవో మధుసూదన్, తహసీల్దార్ మాజిద్, ఎంపీడీవో అఫ్జల్‌మియా, ఏవో అక్షిత పాల్గొన్నారు.
నేషనల్ హైవే
భూసేకరణ వేగవంతం చేయాలి
జగిత్యాల: నేషనల్ హైవే 63, 563 భూసేకరణ పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. గురువారం నేషనల్ హైవే అధికా రులతో సమీక్ష నిర్వహించారు. ఆర్మూర్ నుంచి మంచిర్యాల గల ఎన్‌హెచ్–63, జగిత్యాల–వరంగల్ గల ఎన్‌హెచ్ 563 భూసేకరణ పనులను వేగవంతం చేయాలన్నారు. రహదారి నిర్మాణంలో భూములు పోయిన రైతులు, నివాసం ఉన్న వారు, నష్టపరిహారం కింద చెల్లించాల్సిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎన్‌హెచ్–63 పీడీ అజయ్ మణికుమార్, ఎన్‌హెచ్–563 పీడీ దుర్గప్రసాద్, ఆర్డీవోలు జివాకర్‌రెడ్డి, శ్రీనివాస్, మధుసూదన్ పాల్గొన్నారు.
భూ భారతికి మండలాన్ని ఎంపిక చేస్తాం
కలెక్టర్ సత్యప్రసాద్


