● 99.90 శాతం విద్యార్థుల హాజరు
జగిత్యాల: జిల్లాలో శుక్రవారం పదో తరగతి పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. జిల్లావ్యాప్తంగా ఏర్పాటు చేసిన 67 కేంద్రాల్లో 11,838 మంది విద్యార్థులకు 11,826 మంది విద్యార్థులు హాజరయ్యారు. అలాగే సప్లమెంటరి విద్యార్థులు 31 మందికి 25 మంది హాజరయ్యారు. 99.90 శాతం నమోదైంది. కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అధికారులు పకడ్బందీ చర్యలు చేపట్టారు. ఫ్లయింగ్‌స్క్వాడ్స్ ఎప్పటికప్పుడు సెంటర్లను పరిశీలించారు.
విద్యార్థులు ఒత్తిడికి లోనుకావద్దు: కలెక్టర్ సత్యప్రసాద్
విద్యార్థులు ఎలాంటి ఒత్తిడికి లోను కావద్దని, ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాయాలని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. శుక్రవారం జి ల్లా కేంద్రంలోని ఓల్డ్ హైస్కూల్, పురాణిపేట లో పదో తరగతి పరీక్ష కేంద్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగని వ్వొద్దని, ఇబ్బందులుంటే తమ దృష్టికి తీసుకువస్తే పరిష్కరించడం జరుగుతుందన్నారు. క లెక్టర్ వెంట జగిత్యాల ఆర్డీవో మధుసూదన్, డీఈవో రాము, తహసీల్దార్ రామ్మోహన్ ఉన్నారు.
రైతుమిత్ర వాహనం ద్వారా విద్యుత్ సేవలు
రాయికల్(జగిత్యాల): రైతుమిత్ర వాహనం ద్వారా రైతులు విద్యుత్ సేవలు పొందవచ్చని ఏడీఈ సింధూర్‌శర్మ అన్నారు. శుక్రవారం రా యికల్ మండలం సింగరావుపేట, భూపతి పూర్ గ్రామాల్లో పొలంబాట కార్యక్రమంలో భాగంగా విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో అవగాహ న సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వ్యవసాయ మోటార్లకు కెపాసిటర్లు అమర్చుకోవాలని, మరమ్మతుకు గురైన ట్రాన్స్‌ఫార్మర్లను రైతుమిత్ర వాహనం ద్వారానే విద్యుత్ శాఖ మార్పిడి చేస్తుందన్నారు. దీని కోసం ఎవరికీ డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. కార్యక్రమంలో ఏఈలు తుమ్మల నవీన్, రాజేశం, సబ్ ఇంజినీర్లు సంతోష్, రాజు, శ్రీనివాస్ పాల్గొన్నారు.