
రోగులకు మెరుగైన వైద్యం అందించాలి
జగిత్యాల: రోగులకు మెరుగైన వైద్యం అందించాలని రాష్ట్ర ఆరోగ్య కుటుంబ సంచాలకులు డాక్టర్ రవీందర్‌నాయక్ అన్నారు. శుక్రవారం జగిత్యాల జిల్లా కేంద్రంలోని మోతె పట్టణ ఆరోగ్య కేంద్రంతో పాటు పలు సబ్‌సెంటర్లను తనిఖీ చేశారు. ఆరోగ్య కేంద్రాల్లో మందుల నిల్వలు, నిర్వహణ పుస్తకాలు, రక్తనమూనాలు టీహబ్‌కు పంపుతున్నారా లేదా వంటి అంశాలను పరిశీలించారు. పలు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న రోగులను వైద్యం ఎలా అందుతుందని అడిగి తెలుసుకున్నారు. గర్భిణుల న మోదు, వారికి అందించే సేవలు, పిల్లలకు వ్యాక్సినేషన్, ఎంసీహెచ్ పోర్టల్ నిర్వహణను పరిశీలించా రు. జిల్లాలో 151 సబ్‌సెంటర్లలో సొంత భవనాలు ఉన్నవాటి వివరాలు, నిర్మాణాల గురించి అడిగి తెలుసుకున్నారు. డీఎంహెచ్‌వో కార్యాలయంలో విధులు నిర్వహిస్తూ గుండెపోటుతో మృతిచెందిన రాజ్‌కుమార్ మృతదేహానికి నివాళి అర్పించారు. డీఎంహెచ్‌వో శ్రీధర్, ప్రోగ్రాం అధికారులు స మియోద్దీన్, శ్రీనివాస్, స్వామి, ప్రవీణ్‌చంద్ర, స్వాతిలక్ష్మణ్, సత్యనారాయణ, రమణ, భూమేశ్వర్ పాల్గొన్నారు.