
మాట్లాడుతున్న ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి
జగిత్యాలరూరల్: రాష్ట్రంలోని ప్రతీ నిరుద్యోగ యువతకు బతుకుదెరువు చూపిస్తామని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి అభయం ఇచ్చారు. బుధవారం టీఆర్‌నగర్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ కార్యాల యం ప్రారంభించిన అనంతరం ఆయన మా ట్లాడారు. దేశంకోసం ప్రాణత్యాగం చేసిన పా ర్టీ కాంగ్రెస్ అన్నారు. గతంలో టీఆర్‌నగర్‌ను అభివృద్ధి చేసింది కాంగ్రెస్సే అని, ప్రస్తుతం బీ ఆర్‌ఎస్ పార్టీ ప్రజలను మభ్యపెట్టి ఓట్లు కొల్ల గొడుతోందని అన్నారు. అన్నిమతాలకు నిలయమైన టీఆర్‌నగర్ గ్రామస్తుల సమస్యలు పరిష్కరిస్తానని ఆయన హామీ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భవిస్తే.. మెరుగైన ఉపాధి అవకాశాలు లభిస్తాయని భావిస్తే నిరాశే ఎదురైందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో నాయకులు గంగాధర్, సిరజ్, కొండ వేణుగోపాల్, జిల్లా రవీందర్, ఇమ్రాన్ పాల్గొన్నారు.