
ఉగాది పురస్కారాలు అందుకున్న అర్చకులు
ధర్మపురి: ధర్మపురి శ్రీలక్ష్మీనృసింహస్వామి ఆలయ అర్చకులు చిలుకముక్కు రమణాచార్యులు, పాలెపు ప్రవీణ్‌శర్మ ఉగాది పురస్కారాలు అందుకున్నారు. ఉగాది పర్వదినం సందర్భంగా బుధవారం హైదరాబాద్ రవీంద్ర భారతిలో ఉత్సవాలు నిర్వహించారు. రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ద్వారా అర్చకులు పురస్కారాలు అందుకున్నారు. చిలుకముక్కు రమణాచార్యులు నృసింహుని ఆలయంలో, పాలెపు ప్రవీణ్‌శర్మ శ్రీరామలింగేశ్వరస్వామి ఆలయంలో అర్చకులుగా పనిచేస్తున్నారు.

పురస్కారం అందుకుంటున్న అర్చకులు