
● పెరుగుతున్న ఉష్ణోగ్రతలతోనూ వడగళ్ల వాన ● పొలాస వ్యవసాయ పరిశోధన స్థానం డైరెక్టర్, శాస్త్రవేత్త శ్రీనివాస్
విషవాయువుల విడుదల
● గతంతో పోల్చితే ప్రస్తుతం వాతావరణాన్ని కలుషితం చేసే కార్బన్ డై యాకై ్సడ్, మిథేన్, నైట్రస్ ఆకై ్సడ్ వంటి గ్రీన్‌హౌస్ వాయువుల విడుదల మోతాదు మించింది.
● వాతావరణానికి హానిచేసే వాయువులను పీల్చుకునే అడవుల శాతం తగ్గుతోంది.
● దీనికితోడు పారిశ్రామీకరణ వృద్ధి కావడం, మోటారు వాహనాలు విడుదల చేసే కార్బన్ మోనాకై ్సడ్ వంటి ఉద్గారాల శాతం పెరగడంతో వాతావరణ సమతుల్యత దెబ్బతింటోంది.
పెరుగుతున్న భూతాపం..
● ఏటా ఉద్గారాలతో భూతాపం క్రమంగా పెరుగుతోంది. గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు రికార్డుస్థాయిలో నమోదవుతున్నాయి. ఉష్ణోగ్రతలు పెరిగినప్పుడు ఒక్కసారిగా భూమిపై వేడి వాతావరణం ఏర్పడుతుంది. భూమి పైనుంచి, సముద్రాల నుంచి తేమతో నిండిన నీటిని ఆవిరి రూపంలో పైకి తీసుకెళ్తుంటాయి. ఆ నీటి ఆవిరి పైకి వెళ్లినకొద్దీ ఎంతో శక్తిని గ్రహిస్తాయి. ఆ సమయంలోనే ఆకాశంలో క్యూములో నింబస్ మేఘాలు ఏర్పడతాయి.
వడగళ్ల వాన ఎలా కురుస్తుందంటే..
● ఉష్ణోగ్రతలు పెరిగినప్పుడు, నీటిఆవిరి రూపంలో ఆకాశంలోకి బలమైన ఒత్తిడితో వెళ్తుంది.
● ఆ సమయంలో వాతావరణంలో గాలి లేకుండా ఖాళీ ఏర్పడుతుంది.
● ఈ సమయంలోనే అల్పపీడన ద్రోణి తయారు అవుతుంది.
● ఈక్రమంలో తీవ్రమైన ఒత్తిడితో తేమగల నీటి ఆవిరి పైకి వెళ్తూనే ఉంటుంది.
● ఆకాశంలో కొంతదూరం వెళ్లాక జీరో డిగ్రీ సెంటిగ్రేడ్ వద్ద చల్లబడుతుంది.
● అదేవేగం, తేమతో కూడిన నీటిఆవిరి ఇంకా పైకి వెళ్లినప్పుడు మైనస్ డిగ్రీల సెంటిగ్రేడ్‌కు వెళ్లి సూపర్ కూలింగ్ అవుతుంది.
● అది అతిశీతల ప్రదేశం కావడంతో పైకి వెళ్లిన తేమతోఉన్న నీటిఆవిరి మంచు గడ్డలుగా తయారవుతుంది.
● ఒక్కో మంచుగడ్డ సైజు కిలోలను మించి పోతూ ఉంటుంది.
● మంచుగడ్డలు భారీగా మారాక, వాటి బరువును ఆపలేక భూమిపై పడుతుంటాయి.
● భూమిపై చేరుకునే సరికి మంచుగడ్డలు కరుగుతూ కింద పడుతుంటాయి.
● ఈ సమయం తక్కువగా ఉంటే, భూమిపై మంచు గడ్డలుగానే పడుతుంది.
● భూమిపై పడుతున్న గడ్డలు కొన్నిచోట్ల చిన్నగా, మరికొన్నిచోట్ల పెద్దగా ఉంటాయి.
పంటలకు నష్టం..
● వరిలో గింజలు పాలుపోసుకునే దశనుంచి పంట చేతికి అందేవరకూ ఎప్పుడు వడగళ్ల వాన పడ్డా నష్టమే. పూతదశలో ఉన్న పంటల్లో పూతరాలిపోతుంది. బలమైన ఈదురుగాలులతో కాయలు రాలిపోతుంటాయి. ముఖ్యంగా, పంటల్లో చీడపీడలు పెరగడానికి అనువైన వాతావరణం ఏర్పడుతుంది. తొందరగా పురుగులు తమ ఉధృతి పెంచుతాయి. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో వరిలో కాండం తొలుచుపురుగు, మెడవిరుపు, నువ్వు పంటలో ఆకుమచ్చ తెగులు, కాండం, వేరుకుళ్లు తెగులు, మామిడిలో తామరపురుగు, కూరగాయల్లో నారుకుళ్లు తెగులు వ్యాప్తిచెందే అవకాశం ఉంది. తెగుళ్లు, పురుగుల నివారణకు రైతులు అవసరమైన సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. ఏ పంటలోనైనా వర్షపునీరు రోజుల తరబడి ఉంటే వేరు వ్యవస్థ దెబ్బతింటుంది కాబట్టి వీలైనంత త్వరగా వర్షపు నీటిని తీసివేయాలి.
10 జిల్లాలకు ముందస్తు సమాచారం..
● ఉత్తర తెలంగాణ(పొలాస) వ్యవసాయ పరిశోధన స్థానం ద్వారా 10 జిల్లాలకు అవసరమైన ముందస్తు వాతావరణ సమాచారాన్ని ప్రతీ మంగళ, శుక్రవారాల్లో అందిస్తున్నాం. ఇందు కోసం ప్రత్యేక బులెటిన్‌ను మీడియాకు పంపిస్తున్నాం. ఆయా వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా, ఆ సమయాల్లో పంటల్లో చేయాల్సిన చర్యలను కూడా రైతులకు వివరిస్తున్నాం.
జగిత్యాలఅగ్రికల్చర్: వాతావరణంలో తలెత్తుతున్న మార్పులతోనే వడగళ్ల వానలు కురుస్తున్నాయని, బలమైన ఈదురుగాలులు జనజీవనంపై తీవ్రప్రభావం చూపుతున్నాయని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం వాతావరణ పరిశోధన విభాగం ప్రిన్సిపాల్‌గా పనిచేసిన సైంటిస్ట్, పొలాస వ్యవసాయ పరిశోధన స్థానం డైరెక్టర్ జి.శ్రీనివాస్ తెలిపారు. ఇటీవల కురిసిన వడగళ్లవాన, బలమైన ఈదురుగాలులకు కారణాలపై ఆయన వివరించారు. ఆయన మాటల్లోనే..
సీజన్ సమయాన్ని మార్చడం కష్టమే..
ఒక్కో ప్రాంతంలో ఒక్కోరకమైన వాతావరణ పరిస్థితులు ఉంటాయి.
దీనిద్వారా ఆయా ప్రాంతాలకు అనువైన పంటలు వేయాల్సి ఉంటుంది.
కాబట్టి పంటల సీజన్ సమయాన్ని నెలరోజులు పొడిగించడం, నెలరోజులు తగ్గించడం కుదరకపోవచ్చు.
దీనిద్వారా రకరకాల వాతావరణ సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది.
ఉదాహరణకు.. సీజన్‌ను ముందుకు జరిపితే చలి సమస్య, సీజన్‌ను వెనుకకు జరిపితే ఉష్ణోగ్రతలు ఇబ్బందికరంగా మారుతాయి.
