ఆమె నిర్లక్ష్యం.. ఎంతటి ప్రమాదానికి దారి తీసిందంటే.. | Viral: Careless Pedestrian Miraculously Survives Car Accident | Sakshi
Sakshi News home page

షాకింగ్‌ వీడియో: నిర్లక్ష్యంగా రోడ్డు దాటబోయింది! అంతలోనే..

Sep 7 2022 8:37 PM | Updated on Sep 8 2022 8:34 AM

Viral: Careless Pedestrian Miraculously Survives Car Accident - Sakshi

వెనక వచ్చే వాళ్లు వారిస్తున్నా కూడా వినకుండా రోడ్డు దాటేందుకు యత్నించింది.. 

వైరల్‌: వాహనదారులు మాత్రమే కాదు.. రోడ్డు దాటే క్రమంలోనూ పాదాచారులు జాగ్రత్తలు, కొన్ని నిబంధనలు కొన్ని పాటించాల్సి ఉంటుంది. కానీ, కంగారులోనో.. నిర్లక్ష్యంతోనో కొందరు చేసే పని ప్రమాదాలకు దారి తీస్తుంటాయి. తాజాగా.. అలాంటి ఓ వీడియోనే వైరల్‌ అవుతోంది. 

ఓ మహిళ రోడ్డు దాటే క్రమంలో జరిగిన ప్రమాదం ఇది. వెనకాలే ఆమెతో పాటు ఉన్నవాళ్లు ఆగిపోగా.. ఆమె మాత్రం ముందుకు వెళ్లిపోయింది. అయితే.. ఆమెను చూసి ఓ కారు డ్రైవర్‌ సడన్‌ బ్రేకులు వేయగా.. ఆ వెనకాలే వస్తున్న మరో కారు ఢీ కొట్టాయి. కార్లు రెండు ఘోరంగా ఢీ కొట్టి ప్రమాదానికి గురి కాగా..  ఆమె మాత్రం తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకుంది. పోనీ.. ఆపైనా ఆమె జాగ్రత్తగా ఉందా? అంటే.. అదీ లేదు. 

అంత ప్రమాదం నుంచి తప్పించుకుని వెనక్కి వచ్చేప్పుడు మరో కారు ముందు కూడా ఝలక్‌ ఇచ్చుకుంటూ పోయింది. ఇది ఎక్కడ జరిగిందో స్ఫష్టత లేకున్నా.. సీసీటీవీ ఫుటేజీ ద్వారా ఇప్పుడు వైరల్‌ అవుతుండడం విశేషం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement