చైనీస్‌ ల్యాబ్‌ లీక్‌ వల్లే కరోనా సంభవించింది: యూఎస్‌ నివేదిక

US Said Covid19 Pandemic Likely Arose From Chinese Laboratory Leak - Sakshi

కరోనా పుట్టినిల్లు చైనా అంటూ ప్రపంచ దేశాలన్ని నిందించిన సంగతి తెలిసిందే. పైగా ఈ మహమ్మారి చైనా ల్యాబ్‌ నుంచి లీక్‌ అయ్యిందంటూ పలు వార్తలు గుప్పుమన్నాయి. ఐతే ఇప్పుడు తాజాగా యూఎస్‌ ఎనర్జీ డిపార్ట్‌మెంట్‌ సైతం కరోనా మహమ్మారి చైనా ల్యాబ్‌ నుంచే లీక్‌ కారణంగానే సంభవించిందని తేల్చి చెప్పింది. ఐతే ఈ విషయమై అమెరికన్‌ ఇంటిజెన్స్‌ ఏజెన్సీలు కచ్చితమైన అభిప్రాయానికి రాలేకపోతున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని నేషనల్‌ ఇంటెలిజెన్స్‌ డైరెక్టర్‌ అవ్రిల్‌ హైన్స్‌ కార్యాలయం గుర్తించినట్లు ది వాల్‌ స్ట్రీట్‌ జర్నల్‌ నివేదించింది.

గతంలో ఇదే ఎనర్జీ డిపార్ట్‌మెంట్‌ వైరస్‌ ఎలా ఉద్భవించిందనేది నిర్ణయించబడలేదని చెప్పింది. కానీ ఇప్పుడూ తాజాగా 2021లో ఇచ్చిన నివేదికను నవీకరిస్తూ వ్యూహాన్‌ ల్యాబ్‌ లీక్‌ వల్లే ఆ మహమ్మారి ఉద్భవించిందని పేర్కొంది ఎనర్జీ డిపార్ట్‌మెంట్‌. అదీగాక డిపార్ట్‌మెట్‌ ఈ విషయాన్ని పూర్తి స్థాయిలో ధృవీకరించలేదు. ఈ విషయంపై వివిధ ఏజెన్సీలు వేరువేరుగా తమ నివేదికలను ఇచ్చాయి. ఐతే ఈ ఎనర్జీ డిపార్ట్‌మెంట్‌ ప్రయోగశాల దుర్ఘటన ఫలితంగానే ఈ మహమ్మారి సంభవించిందంటూ ఫెడరల్‌ ఇన్విస్టేగేషన్‌ సరసన నిలిచింది.

ఇదిలా ఉండగా, నాలుగు ఏజెన్సీలు కోవిడ్‌ సహజంగానే ఉద్భవించిందని విశ్వస్తుండగా, మరో రెండు ఏజెన్సీలు ఏ విషయాన్ని నిర్థారించలేదు. ఏదీఏమైన ఈ కరోనా విషయంపై పలు భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయని జాతీయ భద్రతా సలహదారు జేకే సుల్లివిన్‌  నొక్కి చెప్పారు. దీనిపై ప్రస్తుతం కచ్చితమైన సమాధానం ఇంటిలిజెన్సీ విభాగాల నుంచి రాలేదని తెలిపారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ కోవిడ్‌ మూలల గురించి వెల్లడించే వరకు తమ పరిశోధనలు కొనసాగిస్తామని ఇన్విస్టిగేషన్‌ ఏజెన్సీ తెలిపింది. ఏజెన్సీ తమ పరిశోధనలు విరమించుకుంటున్నట్లు వస్తున్న వార్తలను కూడా ఖండించింది. శాస్త్రీయపరంగా మెరుగ్గా ఈ వైరస్‌పై పోరాడటానికి, నిరోధించటానికి ఈ కరోనా మహమ్మారి మూలాన్ని గుర్తించడం అత్యంత కీలకం.

(చదవండి: ఇరాన్‌లో దారుణం.. వందలాది మంది విద్యార్థినులపై విష ప్రయోగం)

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top