డెల్టా వేరియంట్‌ ఆందోళనకరమైంది

US CDC classifies Delta variant as variant of concern - Sakshi

ప్రకటించిన అమెరికా సీడీసీ

వాషింగ్టన్‌: భారత్‌లో మొట్టమొదటిసారిగా గుర్తించిన కోవిడ్‌–19 వేరియంట్‌ ‘డెల్టా’ను ఆందోళనకరమైన వేరియంట్‌గా అమెరికా సెంటర్స్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌ (యూఎస్‌ సీడీసీ) ప్రకటించింది. అమెరికాలో ప్రస్తుతం వ్యాప్తిలో ఉన్న బి.1.1.7.(ఆల్ఫా), బి.1.351(బీటా), పి.1(గామా), బి.1.427 (ఎప్సిలన్‌), బి.1.429(ఎప్సిలన్‌), బి.1.617.2 (డెల్టా) వేరియంట్లను ఆందోళనకరమైనవిగా గుర్తిస్తున్నాం. అయితే, అత్యంత ప్రభావం చూపే వేరియంట్లను అమెరికాలో ఇప్పటి వరకు గుర్తించలేదు’ అని సీడీసీ ఒక ప్రకటనలో పేర్కొంది.

జూన్‌ 5వ తేదీ నాటికి దేశంలో నమోదైన కోవిడ్‌ కేసుల్లో 9.9% డెల్టా వేరియంట్‌వేనని తెలిపింది. డెల్టా సంక్రమణ వేగం చాలా ఎక్కువనీ, ప్రస్తుతం ఉన్న చికిత్సా విధానాలు దీనిపై అంతగా ప్రభావం చూపలేకపోతున్నాయని వివరించింది. డెల్టాను ఆందోళనకర వేరియంట్‌గా మే 10వ తేదీనే ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. కాగా, జూన్‌ 13వ తేదీ నాటికి అమెరికాలో నమోదైన కేసుల్లో 10.3% డెల్టా వేరియంట్‌వేనని ఔట్‌బ్రేక్‌ ఇన్ఫో అనే వెబ్‌సైట్‌ వెల్లడించింది. వచ్చే నెల రోజుల్లో అమెరికాలోని కోవిడ్‌ కేసుల్లో అత్యధిక భాగం డెల్టా వేరియంట్‌కు చెందినవే అవుతాయని సీఎన్‌ఎన్‌ ఒక కథనంలో హెచ్చరించింది.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top