Twitter Edit Feature: ట్విటర్‌లో భారీ మార్పు.. ‘ఎడిట్‌ ట్వీట్‌’ ఎలా పని చేస్తుందంటే..

Twitter Adds Edit Tweet Button Did You Know how It Works - Sakshi

మైక్రోబ్లాగింగ్‌ ప్లాట్‌ఫామ్‌ ట్విటర్‌.. అతిత్వరలో భారీ మార్పు తీసుకురానుంది. ఎడిట్‌ ట్వీట్‌ బటన్‌ వెసులుబాటును తేనుంది. అయితే.. దీనిని ట్విటర్‌ బ్లూ సబ్‌స్క్రయిబర్స్‌కు మాత్రమే రాబోయే రోజుల్లో అందించనున్నట్లు ట్విటర్‌ పేర్కొంది.

ట్విటర్‌లో ఒకసారి గనుక ట్వీట్‌ చేస్తే.. దానిని ఎడిట్‌ చేసే అవకాశం లేదు ఇప్పటిదాకా. అయితే ఎడిట్‌ బటన్‌ వల్ల ట్వీట్‌ పబ్లిష్‌ అయిన 30 నిమిషాల్లోపు ట్వీట్‌ను ఎడిట్‌ చేసే అవకాశం ఉంటుంది. అంతేకాదు.. సెండ్‌ బటన్‌ నొక్కాక 30 సెకన్ల లోపు అన్‌డూ ద్వారా క్యాన్సిల్‌ కూడా చేయొచ్చు. ట్విటర్‌యూజర్లు.. దానిని క్లిక్‌ చేసి మార్పులు, ఒరిజినల్‌గా వాళ్లు చేసిన ట్వీట్‌ను సైతం చూసే వెసులుబాటు తేనుంది. 

ప్రస్తుతానికి ప్రపంచవ్యాప్తంగా 320 మిలియన్ల మంది యాక్టివ్‌ యూజర్లు ఉన్నారు. చాలాకాలంగా ఎడిట్‌ ఆప్షన్‌ను తీసుకురావాలని యూజర్లు కోరుతున్నా.. ట్విటర్‌ మాత్రం అందుకు ఒప్పుకోవడం లేదు. దీంతో ఇప్పుడు తేనున్న ఈ ఆప్షన్‌ ముందుముందు యూజర్లందరికీ అందుబాటులోకి వచ్చే అవకాశాలు లేకపోలేదు.

అయితే.. 2020లో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో అప్పటి ట్విటర్‌ సీఈవో జాక్‌ డోర్సే.. ట్విటర్‌ ఎప్పటికీ ఎడిట్ ట్వీట్‌ ఫీచర్‌ తేకపోవచ్చని కామెంట్‌ చేశాడు. ఈ ఫీచర్‌ వల్ల తప్పుడు సమాచారం వ్యాప్తి కావొచ్చని ఆయన అభిప్రాయపడ్డాడు. అంతేకాదు కొందరు టెక్‌  నిపుణులు సైతం ఎడిట్‌ ట్వీట్‌ బటన్‌ వల్ల స్టేట్‌మెంట్లను మార్చే ప్రమాదం ఉందని హెచ్చరించారు.

ఇదీ చదవండి: తల్లిదండ్రులు, భార్య గురించి రిషి సునాక్‌ ఏమన్నారంటే..

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top