Rai Typhoon: విమానాలు, ఓడరేవుల మూసివేత! ఈ యేడాది 50వ తుఫానిది..

Super Typhoon Rai Is Going To Wreak Havoc In Philippines - Sakshi

Rai Typhoon Update: ఫిలిప్పీన్స్ దేశానికి మధ్య, దక్షిణ భాగాల వైపు సూపర్ టైఫూన్ వేగంగా కదులుతోంది. రానున్న రోజుల్లో ఈదురు గాలుల్తోపాటు, భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు, ఇది ఈ ఏడాది దేశాన్ని తాకిన 50వ తుఫాను మాత్రమేకాకుండా అత్యంత శక్తివంతమైన తుఫానుగా వాతావరణ శాఖ పేర్కొంది. తుఫాను కారణంగా ప్రాణ, ఆస్తి నష్టాన్ని తగ్గించేందుకు ఇప్పటికే వేలాది మంది ప్రజలను ఆ దేశ ప్రభుత్వం సురక్షిత ప్రాంతాలకు తరలించింది. చాలా మంది ప్రజలు భయంతో ఇళ్లను వదిలి వెళ్లిపోయారు కూడా.

సూపర్ టైఫూన్‌గా అమెరికా ప్రకటన
కాగా ఫిలిప్పీన్స్ వైపు దూసుకుపోతున్న రాయ్ టైఫూన్‌ను అమెరికా నేవీ జాయింట్ టైఫూన్ వార్నింగ్ సెంటర్ ‘సూపర్ టైఫూన్'గా అభివర్ణించింది. దేశంలో ఈ యేడాది సంభవించిన తుఫానుల్లో ఇది అత్యంత శక్తివంతమైన తుఫానుగా మారబోతోందని తెల్పింది.

గంటకు 185 కి.మీ వేగంతో..
ఫిలిప్పీన్స్‌లో రాయ్ హరికేన్ 185 కి.మీ వేగంతో కదులుతున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. విపత్తు నిర్వహణ బృందం అన్ని నౌకలను ఓడరేవులో ఉంచాలని కోరింది. ఎట్టి పరిస్థితుల్లోనూ సముద్రం వైపు వెళ్లవద్దని హెచ్చరించింది. 

పలు ప్రాంతాల్లో హై అలర్ట్‌
నివేదికల ప్రకారం.. ఫిలిప్పీన్స్‌లోని 8 ప్రాంతాల్లో అత్యవసర సన్నాహాలు పూర్తయ్యాయి. దీంతో అన్ని ప్రాంతాల్లో హై అలర్ట్ ప్రకటించారు. టైఫూన్ కారణంగా పసిఫిక్ మహాసముద్రం సమీప ప్రాంతాల్లోని సుమారు 98,000 మందికి పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఐతే 8 ప్రభావిత ప్రాంతాల్లో 30 మిలియన్ల మంది నివసిస్తున్నారు. ఈ తుఫాను ప్రభావిత ప్రాంతాలు విసాయా - మిండనావో ఐలాండ్ల మధ్య ఉన్నాయి.

విమానాలు, ఓడరేవులు పూర్తిగా మూసివేయబడ్డాయి
తుఫాను సమయంలో, ఆ తర్వాత కూడా దేశవ్యాప్తంగా భారీ వర్షం, బలమైన గాలులు వీచే అవకాశం ఉన్నట్లు సమాచారం. పలు ప్రాంతాల్లో వరద ముప్పు పొంచి ఉన్నట్లు ఉత్తర్వులు జారీ చేయబడ్డాయి. ఈ ఘోర విపత్తు దృష్ట్యా ఫిలిప్పీన్స్‌కు వెళ్లే అన్ని విమానాలు రద్దు చేయబడ్డాయి. అన్ని పోర్టులు తాత్కాలికంగా మూసివేయబడ్డాయి.

చదవండి: పచ్చనికాపురంలో చిచ్చురేపిన అనుమానం! భార్యను హతమార్చి భర్త ఆత్మహత్య..

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top