రాహుల్‌ గాంధీకి ఆ పట్దుదల లేదు : ఒబామా

Eager To Impress.. Barack Obama Book On Rahul Gandhi - Sakshi

“ఎ ప్రామిస్డ్ ల్యాండ్” పుస్తకంలో ప్రస్తావన!

న్యూఢిల్లీ : 'కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీలో ఎక్కడో తెలియని భయం ఉంది. తరగతి గదిలో టీచర్‌ను ఆకట్టుకోవడానికి ప్రయత్నించే విద్యార్థిలా రాహుల్‌ చాలా ఆత్రుతగా ఉంటారు. అయితే ఏదైనా ఓ విషయం గురించి లోతుగా నేర్చుకోవాలనే అభిరుచి, లక్షణం, పట్టుదల లేదు’ అని అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామా పేర్కొన్నట్టు న్యూయార్క్ టైమ్స్  ఓ కథనాన్ని ప్రచురించింది. ఒబామా..తన రాజకీయ అనుభవాలు, జీవిత జ్ఞాపకాలను ‘ఎ ప్రామిస్డ్ ల్యాండ్’ పేరుతో  ఓ పుస్తకాన్ని రాశారు. నవంబరు 17న ఈ పుస్తకాన్ని విడుదల చేయనున్నారు. (వీడియో ట్వీట్‌ చేసిన ఒబామా)

ఇందులో భాగంగా సోనియా గాంధీ, మన్మోహన్‌ సింగ్‌లపై కూడా ఒబామా పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసినట్లు న్యూయార్క్ టైమ్స్  పేర్కొంది. అయితే భారత ప్రధాని నరేంద్ర మోదీ గురించి ఏం రాశారు అన్నది ఇంకా తెలియరాలేదు. అలాగే అధ్యక్షుడి హోదాలో రెండుసార్లు 2010, 2015లో భారత్ పర్యటనకు వచ్చిన వ్యక్తిగా ఒబామా చరిత్ర సృష్టించారు. ఇక కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ 2017లో ఒబామాను కలిశారు. ఒబామా గతంలో ‘డ్రీమ్స్ ఫ్రమ్ మై ఫాదర్’, ‘ది అడాసిటీ ఆఫ్ హోప్’, ‘ఛేంజ్ వి కెన్ బిలీవ్ ఇన్’  పుస్తకాలు రాశారు. 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top