ఫేస్‌బుక్, ట్విట్టర్, గూగుల్‌లపై ట్రంప్‌ దావా

Donald Trump Sues Facebook And Twitter - Sakshi

వాషింగ్టన్‌: తనను అన్యాయంగా మాధ్యమాల నుంచి తొలగించారంటూ ఫేస్‌బుక్, ట్విట్టర్, గూగుల్‌ సంస్థలు సహా వాటి సీఈఓలపై న్యాయపోరాటం చేసేందుకు ట్రంప్‌ సిద్ధమయ్యారు. వారిపై దావా వేస్తున్నట్లు బుధవారం ప్రకటించారు. ఫ్లోరిడా లోని యూ.ఎస్‌ జిల్లా కోర్టులో దావాలు దాఖలు చేసినట్లు బెడ్‌మినిస్టర్‌లో జరిగిన న్యూస్‌ కాన్ఫరెన్స్‌లో వెల్లడించారు. గొంతుక లను వినిపించకుండా చేయడాన్ని, బ్లాక్‌లిస్ట్‌లో పెట్టడాన్ని ఆపాలన్నదే తమ డిమాండ్‌ అని పేర్కొన్నారు. ఈ దావాల్లో ముఖ్యప్రతివాది తానేనని పేర్కొన్నారు. కాపిటల్‌ భవనం మీద దాడికి ఉసిగొల్పారంటూ ఈ ఏడాది జనవరి 6న ట్రంప్‌ సోషల్‌ మీడియా ఖాతాలను ట్విట్టర్, ఫేస్‌బుక్‌లు రద్దు చేశాయి.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top