ప్రపంచంలోనే చైనా ఫాస్టెస్ట్ ఇంటర్‌నెట్.. సెకనుకి 150 సినిమాల ప్రసారం

China Launches World Fastest Internet - Sakshi

బీజింగ్: ప్రపంచంలోని అత్యంత వేగవంతమైన ఇంటర్నెట్ నెట్‌వర్క్‌ను చైనీస్ కంపెనీలు ఆవిష్కరించాయి. ఇది సెకనుకు 1.2 టెరాబిట్‌ల డేటాను ప్రసారం చేయగలదని  సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ తెలిపింది. ఈ వేగం ప్రస్తుత ప్రధాన ఇంటర్నెట్  కంటే పది రెట్లు ఎక్కువని పేర్కొంది. సింఘువా విశ్వవిద్యాలయం, చైనా మొబైల్, హువాయ్ టెక్నాలజీస్, సెర్నెట్ కార్పొరేషన్‌లు దీనిని అభివృద్ధి చేశాయి. 

బీజింగ్-వుహాన్- గ్వాంగ్‌జౌలను అనుసంధానిస్తూ ప్రత్యేకమైన ఆప్టికల్ ఫైబర్ కేబులింగ్ సిస్టమ్ ద్వారా దాదాపు 3,000 కిలోమీటర్ల వరకు ఈ ఇంటర్‌నెట్‌ సౌకర్యాన్ని ఏర్పాటు చేశారు. ప్రపంచంలోని ఇంటర్నెట్ నెట్‌వర్క్‌లు సాధారణంగా సెకనుకు కేవలం 100 గిగాబిట్ల వేగంతో పనిచేస్తాయి. అమెరికా ఐదవ తరం ఇంటర్నెట్ కూడా సెకనుకు 400 గిగాబిట్ల వేగాన్ని కలిగి ఉంది. కానీ చైనా కనిపెట్టిన ఇంటర్‌నెట్ సెకనుకు  1.2 టెరాబిట్‌ (1,200 గిగాబిట్‌)ల డేటాను ప్రసారం చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంది.

బీజింగ్-వుహాన్-గ్వాంగ్‌జౌ ప్రాజెక్టు చైనా భవిష్యత్ ఇంటర్‌నెట్‌ టెక్నాలజీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో భాగం. ఇది కేవలం ఒక సెకనులో 150 హై-డెఫినిషన్ ఫిల్మ్‌లకు సమానమైన డేటాను బదిలీ చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉందని హువాయ్‌ టెక్నాలజీస్ వైస్-ప్రెసిడెంట్ వాంగ్ లీ వివరించారు.

ఇదీ చదవండి: హమాస్‌ ఇజ్రాయిల్‌ మధ్య కుదిరిన డీల్‌!

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top