నేను తర్వాత కొనేది అదే.. ఎలన్‌ మస్క్‌ మరో సంచలన ప్రకటన

Buy Coca Cola Put The Cocaine Back Says Elon Musk - Sakshi

బహు తిక్క మేధావి ఎలన్‌ మస్క్‌ మరో సంచలన ప్రకటన చేశాడు. సోషల్‌ మీడియా శృంఖలాలు తెంచడంలో భాగంగానే తాను ట్విటర్‌ను కొనుగోలు చేసినట్లు మస్క్‌ చెప్పిన విషయం తెలిసిందే. నాటకీయ పరిణామల నడుమ సుమారు 44 బిలియన్‌ డాలర్ల డీల్‌తో ఎట్టకేలకు ట్విటర్‌ను సొంతం చేసుకున్నాడు. 

ఈ తరుణంలో.. ఈ ఉదయం(ఏప్రిల్‌ 28) మరో ట్వీట్‌ చేశాడు. తాను తర్వాత కోకా కోలాను కొనుగోలు చేయబోతున్నట్లు ప్రకటన చేశాడు. కార్బొనేటెడ్ సాఫ్ట్ డ్రింక్స్‌ తయారీతో మల్టీనేషనల్‌ కంపెనీగా పేరున్న ఈ అమెరికన్‌ కంపెనీని, మస్క్‌ చేజిక్కిచుకోనున్నట్లు తెలిపాడు. అంతేకాదు ఇల్లీగల్‌ డ్రగ్‌గా పేరున్న కొకైన్‌ను కోకా కోలాకు తిరిగి చేరుస్తానంటూ సంచలన ప్రకటనతో ట్వీట్‌ చేశాడు. 

కోకా కోలా.. ట్రేడ్‌మార్క్ శీతల పానీయంలో రెండు ప్రాథమిక పదార్థాలు ఉండేవి. కోకా ఆకులు, కోలా గింజలు. కోలా గింజలు కెఫిన్ యొక్క మూలం కాగా, కోకా ఆకుల నుంచి సైకోయాక్టివ్ డ్రగ్ ‘కొకైన్’ వస్తుంది. కోకా-కోలా ఒకానొక సమయంలో ఎక్కువగా కోకా ఆకుల మీదే ఆధారపడింది. కొకైన్‌ను ఆ కాలంలో ఔషధంగా పరిగణించినప్పటికీ.. ఒకానొక టైం వచ్చే సరికి నిషేధిత జాబితాలో చేర్చారు. దీంతో.. అమెరికా దానిని నిషేధించగా.. కోకా కోలా నుంచి ‘సీక్రెట్‌ రెసిపీ’గా పేరున్న కోకా ఆకులు దూరమై.. బదులుగా డీకోకైనైజ్డ్ కోకా ఆకులు వచ్చి చేరాయి.

ఈ తరుణంలో మస్క్.. కోకా కోలాకు తిరిగి ‘కొకైన్‌’ వైభవం తీసుకొస్తానంటూ ట్వీట్‌ చేయడం విశేషం. ఇంకోవైపు మెక్‌డొనాల్డ్స్‌ను కొనుగోలు చేస్తానంటూ గతంలో ఎలన్‌ మస్క్‌ చేసిన ఓ ట్వీట్‌ను.. తిరిగి తానే షేర్‌ చేసిన మస్క్‌.. అద్భుతాలు చేయలేనంటూ మరో తిక్క ట్వీట్‌తో బదులివ్వడం విశేషం. టెస్లా వాటా, షేర్లు అమ్మడంతో మొదలైన మస్క్‌ యవ్వారం.. ఆపై ట్విటర్‌ కొనుగోలుతో తారాస్థాయికి చేరుకుంది. జోక్‌గా భావించిన ప్రతీ విషయాన్ని నిజం చేసుకుంటూ పోతున్నాడు ఈ ప్రపంచ కుబేరుడు.

చదవండి👉: క్షీణిస్తున్న పుతిన్‌ ఆరోగ్యం?

చదవండి👉🏾: ఇమ్మాన్యుయేల్‌ మాక్రాన్‌కు దిమ్మతిరిగే షాక్‌.. వీడియో వైరల్‌

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top