మూడేళ్ల పాటు 6 - 7 వందల మంది అత్యాచారం : బ్రిటీష్ ఎంపీ సంచలన ప్రకటన | assault By 600-700 Men UK MP Shares Pak Grooming Gang Testimonies | Sakshi
Sakshi News home page

మూడేళ్ల పాటు 6 - 7 వందల మంది అత్యాచారం : బ్రిటీష్ ఎంపీ సంచలన ప్రకటన

Jun 2 2026 4:43 PM | Updated on Jun 2 2026 5:11 PM

assault By 600-700 Men UK MP Shares Pak Grooming Gang Testimonies

గత కొన్ని దశాబ్దాలుగా యునైటెడ్ కింగ్‌డమ్ (UK) లోని వివిధ ప్రాంతాలలో సంచలనం సృష్టించిన " పాక్‌గ్రూమింగ్ గ్యాంగ్స్"  (Pakistani Grooming Gangs)పై బ్రిటీష్ ఎంపీ రూపెర్ట్ లోవ్ (Rupert Lowe) పార్లమెంట్‌లో చేసిన ప్రసంగం తీవ్ర చర్చకు దారితీసింది. ఈ దారుణమైన లైంగిక దోపిడీ ముఠాల వెనుక ప్రధానంగా 'పాకిస్తానీ మూలాలు ఉన్న టాక్సీ డ్రైవర్లు , వ్యాపారులు' ఉన్నట్లు యూకే ప్రభుత్వ విచారణలో తేలింది. ఎంపీ రూపెర్ట్ లోవ్ తన వ్యక్తిగత విచారణ ద్వారా బాధితుల నుండి సేకరించిన అత్యంత ఘోరమైన, షాకింగ్ సాక్ష్యాలను బ్రిటీష్ పార్లమెంట్‌లో చదివి వినిపించారు. అధికారులు, పోలీసులు మరియు వ్యవస్థల వైఫల్యాల వల్ల దశాబ్దాలుగా ఈ దారుణం కొనసాగుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

600 - 700 మంది అత్యాచారం
లోవ్ ప్రకారం, ముఠా ఆధారిత బాలల లైంగిక దోపిడీపై తాను జరిపిన స్వతంత్ర విచారణ సమయంలో బాధితుల హృదయవిదారక సాక్ష్యాలను సేకరించారు.  ఒక బాధితురాలు తాను 12 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు ఒక నిందితుడు తనపై మద్యం సీసాతో అత్యంత క్రూరంగా దాడి చేశాడని వివరించింది.మరో మహిళ వందల మంది చేతిలోదారుణమైన అత్యాచారానికి గురైంది. 13 ఏళ్ల వయసు నుండి మూడేళ్ల పాటు దాదాపు 600 నుండి 700 మంది పురుషులు తనపై అత్యాచారం చేశారని పేర్కొంది.

ముఠా సభ్యులు తమను జంతువుల కంటే హీనంగా చూసేవారని, ఒక వ్యాన్‌లో 15 నుండి 20 మంది బాలికలను కుక్కల బోనుల్లో బంధించి ఉంచడం చూశానని ఒక బాధితురాలు తెలిపింది. అలాగే తమపై కుక్కలతో కూడా దాడి చేయించి, ఆ దృశ్యాలను రికార్డ్ చేస్తూ నిందితులు నవ్వుకునేవారని మరో మహిళ వాపోయింది.

వేధింపుల సమయంలో దేశంలోని వివిధ ప్రాంతాలలో కొందరు పోలీసు అధికారులు కూడా తనపై అత్యాచారానికి పాల్పడ్డారని ఒక మహిళ ఆరోపించింది. తీవ్ర గాయాలతో 15 ఏళ్ల వయసులో ఆసుపత్రికి వెళ్తే, భయంతో నిజం చెప్పలేకపోయానని, అక్కడి సిబ్బంది కూడా ఎలాంటి ప్రశ్నలు అడగకుండా కేవలం టాబ్లెట్లు ఇచ్చి పంపించేశారని ఒక బాధితురాలు పేర్కొంది.

ఈ సాక్ష్యాల ప్రకారం, ఈ ముఠాలు శ్వేతజాతీయులు (White) మైనర్‌ బాలికలను, క్రైస్తవ బాలికలనే లక్ష్యంగా దశాబ్దాల పాటు సాగించిన లైంగిక దోపిడీ, అత్యాచారాల దారుణాలకు పాల్పడింది. ముస్లిం బాలికలకు గౌరవం, ఉన్నత నైతిక విలువలు ఉంటాయని, కానీ శ్వేతజాతీయులైన క్రైస్తవ బాలికలకు నైతికత తక్కువగా ఉంటుందంటూ నిందితులు వ్యాఖ్యానించేవారని ఒక బాధితురాలు గుర్తుచేసుకుంది. ఈ దారుణానికి గురైన బాలికలంతా దాదాపు శ్వేతజాతీయులే.

ఒక ముస్లిం మత గురువు (ఇమామ్) కుమారుడి వల్ల ఒక బాధితురాలు గర్భవతి కాగా, ఆ విషయం తెలిసి కూడా అతని తండ్రి తన కొడుక్కి పెళ్లి చేసి, ఆ బిడ్డను చూడవద్దని ఆదేశించాడని, వారు తమ వర్గాన్ని మాత్రమే కాపాడుకుంటారని ఆమె పేర్కొంది. 'ఈద్' వంటి పండుగల సమయాల్లో మరియు సెలవు రోజుల్లో ఈ ముఠాల హింస, పార్టీలు మరింత ఎక్కువగా, క్రూరంగా ఉండేవని బాధితులు తెలిపారు. గతేడాది ఎంపీ రూపెర్ట్ లోవ్ నేతృత్వంలో జరిగిన ప్రైవేట్ దర్యాప్తులో.. యూకేలోని కనీసం 85 ప్రాంతాలలో ఇటువంటి "రేప్ గ్యాంగ్స్" చురుగ్గా ఉన్నట్లు గుర్తించారు. ప్రధానంగా పాకిస్తానీ మూలాలున్న పురుషులు దశాబ్దాలుగా ఈ దారుణాలకు పాల్పడుతున్నారని, ప్రభుత్వ సంస్థల తీవ్ర నిర్లక్ష్యం వల్లే ఇది ఇంతలా విస్తరించిందని ఆగస్టులో విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

అసలేంటీ పాక్‌ గ్రూమింగ్ గ్యాంగ్స్
ఈ గ్రూమింగ్ గ్యాంగ్స్ స్కాండల్ ఒక దశాబ్దం క్రితమే యార్క్‌షైర్‌లోని రోథర్‌హామ్ (Rotherham) నగరంలో వెలుగుచూసింది. 2001 ప్రాంతంలోనే శ్వేతజాతీయులైన చిన్న పిల్లలపై జరుగుతున్న ఈ క్రమబద్ధమైన లైంగిక దాడుల గురించి అధికారులకు సమాచారం అందినప్పటికీ, సరైన చర్యలు తీసుకోకపోవడం గమనార్హం.ర్డ్ వంటి పలు నగరాల్లో దశాబ్దాలుగా వేల సంఖ్యలో బాలికలు ఈ దారుణానికి బలయ్యారు. గతేడాది జరిగిన స్వతంత్ర దర్యాప్తులో యూకేలోని దాదాపు 85 ప్రాంతాలలో ఈ 'రేప్ గ్యాంగ్స్' చురుగ్గా పనిచేస్తున్నట్లు తేలింది. ప్రస్తుతం బ్రిటీష్ పార్లమెంట్‌లో ఈ ముఠాల క్రూరత్వంపై బాధితులు ఇచ్చిన హృదయవిదారక సాక్ష్యాలను బయటపెట్టడంతో, ఈ 'పాక్ గ్రూమింగ్ గ్యాంగ్స్' వ్యవహారం మరోసారి ప్రపంచవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది.

Advertisement
 
Advertisement
Advertisement