1.8 మిలియన్ల ఏళ్ల నాటి మానవ దంతం

Archeologists Discovered Human Tooth In Georgia 1 Million Years Old - Sakshi

న్యూయార్క్‌: పురావస్తు శాస్త్రవేత్తలు జార్జియాలో 1.8 మిలియన్ల ఏళ్ల నాటి మానవ దంతాన్ని కనుగొన్నారు. టిబిలిసికి నైరుతి దిశలో సుమారు 100 కి.మీ దూరంలో ఒరోజ్‌మని గ్రామం వద్ద జరుపుతున్న తవ్వకాల్లో బయటపడింది. ఈ దంతాన్ని ఒక విద్యార్థి గుర్తించాడు.

ఒరోజ్‌మని గ్రామం దమనిసికి సమీపంలో ఉంది. ఈ ప్రాంతంలో 1.8 మిలియన్‌ ఏళ్ల క్రితం మానవ పుర్రెలను 1990ల చివరిలోనూ, 2000ల ప్రారంభంలో కనుగ్నొన్నారు. ఈ సందర్భంగా జార్జియన్‌ నేషనల్‌​ మ్యూజియంలోని పురావస్తు శాస్త్రవేత్త జార్జి కోపలియాని మాట్లాడుతూ....ఆ విద్యార్థి తవ్వకాలు జరపడానికి మ్యూజియం నుంచి వచ్చిన బృందానికి నాయకత్వం వహిస్తున్నాడని చెప్పారు. ఆ సమయంలోనే పురాతన దంతాన్ని కనుగ్నొట్లు పేర్కొన్నారు.

తాము ఈ దంతం విషయమై పాలియోంటాలజిస్ట్‌ని సంప్రదించామని, అతను కూడా దీన్ని 'హోమిన్‌ టూత్‌గా' నిర్ధారించాడని చెప్పారు. 2019 నుంచి తమ బృందం మళ్లీ ఒరోజ్‌మని వద్ద తవ్వకాలు జరపడం ప్రారంభించిదని  జార్జికోపలియాన్‌ చెప్పారు. కానీ కోవిడ్‌-19 కారణంగా ఆ తవ్వకాలు మధ్యలో నిలిచిపోయాయని తెలిపారు.

తమ బృందం గతేడాది నుంచి ఈ తవ్వకాలు తిరిగి ప్రారంభించినట్లు తెలిపింది. అప్పటి నుంచి తమ బృందం చరిత్ర పూర్వంకు ముందు  రాతి పనిముట్లు, అంతరించిపోయిన జాతుల అవశేషాలను కనుగొందని వెల్లడించారు. అంతేకాదు ఈ దంతం ఆధారంగా ఈ ప్రాంతంలో సంచరించే  హోమినిన్‌ల జనాభా గురించి అధ్యయనం చేయగలగడమే కాకుండా తెలుసుకునేందుకు కూడా ఉపకరిస్తుందని అన్నారు. 

(చదవండి: వింత ఘటన ఆకాశంలో కనువిందు చేస్తున్న క్వీన్‌ ఆకృతి)

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top