వింత ఘటన: ఆకాశంలో కనువిందు చేస్తున్న క్వీన్‌ ఎలిజబెత్‌ ఆకృతి

Cloud Formation Resembling Queen Elizabeth After Queens Death - Sakshi

లండన్‌: క్విన్‌ ఎలిజబెత్‌ ఇక లేరు అని బకింగ్‌హామ్‌ ప్యాలెస్‌ ప్రకటించినన కొద్ది క్షణాల్లో యూకేలోని గగనపు వీధుల్లో పలు వింత సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఒక చోట ఆకాశంలో మేఘం ఆమె ఆకృతిలో కనువిందు చేసింది. సెప్టెంబర్‌ 8న ఆమె మరణాన్ని ధృవీకరించిన కొద్ది క్షణాల్లో ఇలా యూకే గగన వీధుల్లో మేఘం ఇలా కనువిందు చేయడం అందర్నీ ఆశ్చర్యంలోకి ముంచెత్తింది.

ఈ ఘటన యూకేలోని ష్రాప్‌షైర్‌లోని టెల్‌ఫోర్డ్‌లో చోటు చేసుకుంది. లీన్‌ అనే మహిళ తన కుమార్తె లీసాతో కలసి కారులో ప్రయాణిస్తున్నప్పుడూ ఆకాశంలో ఈ దృశ్యం కనువిందు చేసింది. దీంతో వారు కొన్ని ఫోటోలను తమ కెమరాలో బంధించారు. ఇలాంటి వింత సంఘటనే బకింగ్‌హామ్‌ ప్యాలెస్‌ పై కూడా కనిపించింది. ప్యాలెస్‌ ఆమె లేరని ప్రకటించిన వెంటనే అక్కడ ఆకాశంలో డబుల్‌ రెయిన్‌ బో కనువిందు చేసింది.

(చదవండి: యాభై ఏళ్ల తర్వాత... ప్రభుత్వ లాంఛనాలతో క్వీన్‌కి అంత్యక్రియలు)

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top