17 గంటలపాటు ఆ శిథిలాల కిందే.. తమ్ముడి కోసం ఆ చిన్నారి..

7 Year Old Syrian Girl Protecting Brother Under Rubble Photo Goes Viral - Sakshi

టర్కీలో ఘోరమైన భూకంపం సంభవించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో భవనాలన్నీ పేకమేడల్లా కూలిపోయి శిథిలాల నగరంగా మారింది. ఎటు చూసినా మనసును కలిచి వేసే దృశ్యాలే. తల్లులను పోగొట్టుకున్న చిన్నారులు ఒకవైపు పిల్లలను పోగొట్టుకుని గర్భశోకంతో ఆక్రందనలు చేస్తున్న తల్లిదండ్రులు మరోవైపు. అక్కడి కన్నీటి రోదనలు ‍ప్రకృతే విలపించేలా విషాదంగా ఉన్నాయి. అలాంటి పరిస్థితిలో ఒక వైరల్‌ ఫోటో అందరి హృదయాలను ద్రవింపచేసింది.

ఆ ఫోటోలో ఇద్దరు చిన్నారులు శిథిలాల కింద తమను కాపాడే వారి కోసం బిక్కు బిక్కుమంటూ ఆత్రంగా ఎదురు చూస్తున్నట్లు ఉంది. అందులో ఆ చిన్నారి తన తమ్ముడి తలపై చేయి వేసి శిథిలాల కింద నలిగిపోకుండా కాపాడుతోంది. వాళ్లు అలా శిథిలాల కింద సుమారు 17 గంటల పాటు చిక్కుపోయినట్లు సమాచారం. అందుకు సంబంధించిన ఫోటోను ఐక్యరాజ్యసమితి ప్రతినిధి మహ్మద్‌ సఫా ట్విట్టర్‌లో షేర్‌ చేశారు.

ఆయన ట్విట్టర్‌లో.." ఆ ఏడేళ్ల బాలిక తమ్ముడిని రక్షించుకోవడానికి పడుతున్న తాపత్రయం మనసును పిండేస్తుంది. ఈ ఫోటోని ఎవరూ షేర్‌ చేయలేదు, ఆ చిన్నారి చనిపోక మునుపే షేర్‌ చేయండి. ఆ చిన్నారులు బతకాలని కోరుకుందాం. పాజిటివ్‌గా ఆలోచిద్దాం" అని పేర్కొన్నారు. దీంతో నెటిజన్లు తమ్ముడి మీద ఆ చిన్నారికి ఉన్న ప్రేమకు ఫిదా అవుతూ..ఏ అక్క చేయని సాహసం చేస్తోంది ఆ చిన్నారి.  వారిద్దరూ బతకడమే గాక ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షిస్తూ..ట్వీట్లు చేశారు. 

(చదవండి: ఆ విమానం కూలి మంటల్లో చిక్కుకుంది..కానీ ఆ ఇద్దరు పైలట్లు..)

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top