ఎయిర్‌ హోస్టెస్‌ల అర్థనగ్న నిరసనలు.. కారణం అదేనట..!

50 Air Hostesses Started Demonstrating At The Middle Of The Crossroads Here Are Resons - Sakshi

కార్మికులు, ఉద్యోగులు, విద్యార్థులు తమకు ఏదైనా అన్యాయం జరిగితే ఆయా కార్యాలయాల్లో పని పూర్తిగా ఆగిపోయేలా చేసి తమ డిమాండ్‌లు నెరవేర్చుకుంటారు. అలాగే ఈ ఎయిర్‌లైన్స్‌ ఎయిర్‌ హోస్టెస్‌లకు కూడా తమ ఉద్యోగాల్లో సమస్యలు ఎదురయ్యాయట. దీంతో వినూత్నంగా నిరసనలు చేపట్టారు. ఆ వివరాలు..

ఇటలీలోని కాంపిడోగ్లియోలో సుమారు 50 మంది ఎయిర్ హోస్టెస్‌లు రోడ్డు మీదకు వచ్చి బట్టలు విప్పి నిరసన చేపట్టారు. జీతంలో కోతలు, ఉద్యోగాల నష్టంపై మనస్తాపం చెందారని, అందుకే తాము నిరసన చేపట్టామని మీడియాకు వెల్లడించారు. ఇంత హఠాత్తుగా వారి ఉద్యోగాల్లో మార్పులు ఎందుకువచ్చాయంటే..

చదవండి: ఉన్నట్టుండి వేప చెట్లు ఎండిపోతున్నాయి.. కారణం తెలియట్లేదు!!

అలిటాలియా ఎయిర్‌లైన్స్ తాజాగా ఐటీఏ ఎయిర్‌వేస్‌ను స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. ఐతే ఈ పరిణామం అలిటాలియా ఎయిర్‌లైన్స్‌లో పని చేస్తున్న ఉద్యోగులపై తీవ్ర ప్రభావాన్ని చూపింది.  అలిటాలియా ఎయిర్‌లైన్స్ దాదాపు 10,500 మంది ఉద్యోగులను నియమించుకుంది. కానీ అయితే ఐటీఏ ఎయిర్‌వేస్‌లో మాత్రం కేవలం 2,600 మంది ఉద్యోగులు మాత్రమే ఉద్యోగాలు పొందగలిగారట. మరోవైపు ఐటీఏ ఎయిర్‌వేస్‌కు చెందిన ఓ ఉద్యోగి..  సీనియారిటీ ప్రకారం రావల్సిన ఉద్యోగాలు కూడా మాకు దక్కలేదు, శాలరీలు కూడా బాగా తగ్గించారు, ఉద్యోగం ఎంతకాలం ఉంటుందో కూడా తెలియని సందిగ్థంలో ఉన్నామని’ విచారం వ్యక్తం చేశారు.

దీని గురించి ఐటిఎ ఎయిర్‌వేస్ ప్రెసిడెంట్ ఆల్ఫ్రెడో అల్టావిల్లాను అడిగితే.. ‘అందరు ఉద్యోగులందరూ కంపెనీ నిబంధనలను అనుసరించి ఒప్పందంపై సంతకం చేసారు. ఉద్యోగులు సమ్మె చేస్తారని నేను భావింలేదు. అలా చేస్తే, వారిపై తీవ్ర ప్రభావం ఉంటుందని మీడియాకు తెలిపారు. 

చదవండి: Suspense Thriller Crime Story: 37 కోట్ల బీమా కోసం పాముకాటుతో చంపించి..

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top