తన జుట్టును తానే తింటున్న బాలిక.. చివరికి ఆహారం....

14 Year Old China Teenager Had Strange Habit Ate 3 Kg Of Her Own Hair  - Sakshi

చాలమందికి పలు రకాలు విచిత్రమైన హ్యబిట్స్‌ ఉంటాయి. వాటిలో కొన్ని మంచివి, చెడ్డవి కూడా ఉంటాయి.  మన అలవాట్లును మన పెద్దలు లేదా తల్లిదండ్రులు గమనించి అవి మంచివో లేక చెడ్డవో వివరించి చెప్పకపోతే ఇక్కడ ఉన్న బాలిక మాదిరి దారుణమైన పరిస్థితిని ఎదుర్కొనక తప్పదు. 

వివరాల్లోకెళ్తే...చైనాకు చెందిన 14 ఏళ్ల బాలికకు ఒక విచిత్రమైన అలవాటు ఉంది. అదేంటంటే తన జుట్టును తానే తింటుంది. ఐతే దీన్ని ఆమె ఇంట్లో వాళ్లు గమనించకపోవడంతో అదే పనిగా చాలా ఏళ్ల నుంచి తన జుట్టును తానే తింటోంది. దీంతో గత కొద్ది రోజులుగా ఆమె ఆహారం తీసుకోలేనంత దారుణమైన స్థితికి వచ్చేసి నీరసంగా తయారైంది. దీంతో ఆమెను ఆస్పత్రికి తీసుకువెళ్లారు ఆమె కుటుంబసభ్యులు. అక్కడ జరిపిన వైద్య పరీక్షల్లో...ఆమె కడుపు మొత్తం ఏకంగా మూడు కిలోల జుట్టుతో నిండిపోయిందని, అందువల్లే ఆమె ఆహారం తీసుకోలేకపోతుందని అ‍న్నారు.

ఆ తర్వాత ఆ బాలికకు వైద్యులు  సుమారు రెండు గంటలపాటు సుదీర్ఘ శస్త్ర చికిత్స చేసి ఆ ముడు కిలోల హెయిర్‌ బాల్‌(ఉండలుగా ఉన్న జుట్టు)ని తీసేశారు. ఈ మేరకు జియాన్ డాక్సింగ్ హాస్పిటల్‌ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్‌ షిహై మాట్లాడుతూ...ఆ బాలిక ఆహారం తీసుకులేని పరిస్థితి ఏర్పడటంతోనే మా వద్దకు వచ్చింది. అసలు ఆమె పొట్టలో ఆహారం పట్టేందుకు అవకాశం లేకుండా జుట్లుతో నిండిపోయిందని, ఆఖరికి ఆమె ఆహార ప్రేగు కూడా మూసుకుపోయిందని చెప్పారు. 

ఆ బాలిక తల్లిదండ్రులు ఉద్యోగ రీత్యా దూరంగా ఉండటంతో ఆమె అమ్మమ్మ తాతయ్యల వద్ద పెరుగుతుందన్నారు. దీంతో వారు ఆమె విచిత్రమైన అలవాటుని గుర్తించలేకపోయారు. ఆ బాలిక పికా అనే విచిత్రమైన డిజార్డర్‌తో బాధపడుతోందని చెప్పారు. ఇలాంటి సమస్యతో బాధపడే చిన్నారులు, కాగితాలు, సుద్ధ ముక్కలు వంటి తినకూడని వాటిని ఆహారంగా తింటుంటారని చెబుతున్నారు. అంతేగాదు తమ జుట్టును తామే తినడాన్ని రాంపూజ్‌ సిండ్రోమ్‌గా వ్యవహిరస్తారని చెప్పారు. ఇది ట్రైకోఫాగియా అనే మానసిక రుగ్మత వల్ల వస్తుందని వైద్యులు చెబుతున్నారు. ఆ చిన్నారి కూడా తన తల్లిదండ్రులకు దూరంగా ఉండటం వల్ల చాల ఏళ్లుగా మానసిక సమస్యలతో బాధపడి ఉండవచ్చని, అందువల్లే ఆమె ఈ విచిత్రమైన అలవాటుకి అడిక్ట్‌ అయినట్లు వైద్యుడు షిహై చెప్పారు.

(చదవండి: డార్విన్‌ సంతకంతో కూడిన లేఖ వేలంలో ఎంత పలుకుతోందంటే...)

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top