
సాక్షి, సిటీబ్యూరో: నగరంలోని జూబ్లీహిల్స్ కేంద్రంగా సేవలందిస్తున్న మోకాళ్ల నొప్పుల నివారణ కేంద్రం ‘ఇపియోన్ పెయిన్ సెంటర్’ ఆధ్వర్యంలో బెంగుళూరు సెంటర్‌ను ప్రారంభించామని వ్యవస్థాపకలు డాక్టర్ సుధీర్ దారా తెలిపారు. చికిత్సలో భాగంగా అత్యంత అధునాతన యంత్రాలను, సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నామని పేర్కొన్నారు. దేశంలోనే మొదటిసారిగా ప్లాస్మా రీజెనరేటివ్ థెరపీని అందుబాటులోకి తీసుకువచ్చామని, అంతేకాకుండా అతి తక్కువ ధరల్లోనే వైద్య సేవలందిస్తున్నామని అన్నారు. చైన్నె, బెంగుళూరు నగరాలతో పాటు మరికొద్ది రోజుల్లో మరో 10 నగరాల్లో తమ కేంద్రాలను ప్రారంభించనున్నామని వెల్లడించారు.
ఎన్నికల సమస్యా..
ఫిర్యాదు చేయండి
సాధారణ ఎన్నికల పరిశీలకుడు
చంద్రకాంత్ డాంగే
సాక్షి, రంగారెడ్డిజిల్లా: ఎన్నికలవేళ అభ్యర్థులు వారి ఏజెంట్లు, సాధారణ ప్రజలు ఎలాంటి సమస్యలు, ఫిర్యాదులున్నా నిరభ్యంతరంగా స్థానిక ఎన్నికల రిటర్నింగ్ అధికారి (ఆర్డీవో) కార్యాలయంలో ఫిర్యాదు చేయొచ్చని సాధారణ ఎన్నికల పరిశీలకుడు చంద్రకాంత్ డాంగే పేర్కొన్నారు. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. గురువారం నుంచి ప్రతిరోజు ఉదయం 10.30 నుంచి 11.30 వరకు గంటపాటు తనకు ఫిర్యాదు చేయొచ్చన్నారు. ఈనెల 29వ తేదీ వరకు ఎన్నికల విషయంలో ఇబ్బందులు, ఫిర్యాదులు స్వీకరిస్తామన్నారు. ఫోన్ ద్వారా కూడా ప్రజలు తమ సమస్యలను తెలుపవచ్చని సూచించారు. ఫోన్ నెంబర్లు 88792 31333/78421 74999 సమస్యలు, ఫిర్యాదులను తెలుపొచ్చని సూచించారు.