● సమ్మక్క సాగర్ బ్యారేజీ వద్ద 1,62,994 క్యూసెక్కుల నీరు
కన్నాయిగూడెం: ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం తుపాకులగూడెంలోని సమ్మక్క సాగర్ బ్యారేజీ వద్ద గోదావరి గంట గంటకూ పెరుగుతోంది. ఎగువన వర్షాలు కురవడంతో వాగులు, వంకలు పొంగిపొర్లి నదిలోకి భారీగా వరద నీరు చేరుతోంది. దీంతో తుపాకులగూడెంలోని సమ్మక్క సాగర్ బ్యారేజీ వద్ద గోదావరి ఉప్పొంగి ప్రవహిస్తోంది. శుక్రవారం 65,300 క్యూసెక్కుల నీటితో సాధారణంగా ప్రవహించిన గోదావరి.. శనివారం ఉదయం 1,20,300 క్యూసెక్కులకు పెరిగింది. సాయంత్రం 1,65,994 క్యూసెక్కులకు పెరిగి ప్రవహిస్తోంది. శుక్రవారం నుంచి ఇప్పటి వరకు రెట్టింపు నీటి ప్రవాహం పెరిగి ప్రవహిస్తోంది. బ్యారేజీ వద్ద ఉన్న గేట్లను ఎత్తి 1,62,994 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. గుట్టగంగారంలోని దేవాదుల ఎత్తిపోతల వద్ద పది మోటార్లు ఉండగా అందులో తొమ్మిది మోటార్లను ఆన్ చేసి 2,306 క్యూసెక్కుల నీటిని దిగువలోని భీంఘన్‌పురం రిజర్వాయర్‌కు పంపింగ్ చేస్తున్నారు.
యువకుడిపై
పోక్సో కేసు నమోదు
కాళేశ్వరం: ఓ బాలికను కిడ్నాప్ చేసిన ఘటన పై జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలంలోని సురారం గ్రామానికి చెందిన ఎం. వేణుపై పోక్సో కేసు నమోదు చేసి రి మాండ్‌కు తరలించినట్లు ఎస్సై సాంబమూర్తి శనివారం ప్రకటనలో తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. కిడ్నాప్‌నకు గురైన బాలిక వాంగ్మూలం ఆధారంగా నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేసి శనివారం అరెస్ట్ చేసి రి మాండ్‌కు తరలించిట్లు పేర్కొన్నారు. బాలికల పై జరిగే నే రా ల విషయంలో కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై హెచ్చరించారు.


