డెంటల్‌ విభాగంలో ఒకే డాక్టర్‌! | - | Sakshi
Sakshi News home page

డెంటల్‌ విభాగంలో ఒకే డాక్టర్‌!

Jul 20 2026 1:32 AM | Updated on Jul 20 2026 1:32 AM

ఎంజీఎం ఆస్పత్రిలో పరికరాలు ఉన్నా వేధిస్తున్న సిబ్బంది కొరత

రోగులకు అరకొరగా వైద్యసేవలు

కాశిబుగ్గ: వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రిలోని డెంటల్‌ (దంత వైద్య) విభాగం నామమాత్రంగా నడుస్తోంది. ఇందులో ఒకే వైద్యురాలు అరకొర వసతుల మధ్య వైద్య సేవలు అందిస్తున్నారు. క్లినికల్‌ వైపు నుంచి ఓ డెంటల్‌ హైజినిస్టు ఓపీ పేషంట్లకు వైద్య చికిత్స చేస్తున్నారు. అయితే, వైద్య నిపుణుల కొరతతో రోగులకు సరైన సేవలు అందడం లేదని విమర్శలు వస్తున్నాయి. గతంలో ఆరోగ్యశ్రీ క్రింద ఇద్దరు వైద్యులుండగా వీరిని తొలగించి ఇంటర్యూలు నిర్వహించారు. ఈ ఇంటర్యూలకు నలుగురు వైద్యులు హాజరు కాగా.. ఇద్దరు వైద్యులను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఏడాది దాటినా కూడా ఆ ఇద్దరు వైద్యుల నియామకం ఎంతవరకు వచ్చిందో తెలియదు. అలాగే, మరో గవర్నమెంట్‌ ఔట్‌సోర్సింగ్‌ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ను సైతం టర్మినేషన్‌ చేశారు. ముఖ్యంగా డెంటల్‌ డిపార్ట్‌మెంట్‌కు హెచ్‌ఓడీగా ఉన్న ప్రొఫెసర్‌ సైతం నర్సంపేటకు బదిలీ అయ్యారు. దీంతో ఈ విభాగం నుంచి నలుగురు వెళ్లినా ఏ ఒక్కరు కూడా రాకపోవడంతో ఇద్దరిపై భారం పడుతోంది. ముఖ్యంగా పంటి వైద్యానికి సంబంధించిన ఎన్నో పరికరాలు ఉన్నా సిబ్బంది లేకపోవడంతో అవి మూలనపడి ఉంటున్నాయి. ఇప్పటికై నా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి దంత వైద్యవిభాగంలో వైద్యులు, సిబ్బందిని నియమించాలని పేషంట్లు, అటెండెంట్లు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement