● పసుపు పంటకు
రికార్డు ధర
● కేసముద్రం మార్కెట్‌లో
క్వింటా రూ.16 వేలు
కేసముద్రం : కేసముద్రం వ్యవసాయ మార్కెట్‌లో బుధవారం పసుపు పంటకు (కాడిరకం) రికార్డు స్థాయిలో రూ.16వేల ధర పలికింది. మార్కెట్‌లో సీజన్ ప్రారంభంలో క్వింటాకు గరిష్ట ధర రూ.12వేల వరకు పలికింది. ఆ తర్వాత క్రమక్రమంగా ధర పెరుగుతూ ఇటీవల రూ.13 వేల నుంచి రూ.14వేల వరకు చేరింది. ఈ నెల 10వ తేదీన కాడి రకం పసుపు పంటకు గరిష్ట ధర రూ.14,300, కనిష్ట ధర రూ.8,400 పలుకగా, గోళా రకం పసుపు పంటకు గరిష్ట ధర రూ.14,201, కనిష్ట ధర రూ.10వేలు పలికింది. కాగా, బుధవారం మార్కెట్‌కు 306 బస్తాల పసుపు అమ్మకానికి రాగా, కాడిరకం పంటకు (పాలిష్ చేసిన పసుపు) క్వింటాకు గరిష్ట ధర రూ.16,159, కనిష్ట ధర రూ.10,300 పలికింది. గోళా రకానికి గరిష్ట ధర రూ.15,500, కనిష్ట ధర రూ.11,101 పలికినట్లు మార్కెట్ అధికారులు తెలిపారు.


