హన్మకొండ కల్చరల్: భద్రకాళి ఆలయంలో శాకంబరీ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా బుధవారం అమ్మవారికి సహస్ర కలశాభిషేకోత్సవం శోభాయమానంగా నిర్వహించారు. ఉత్సవకార్యక్రమాలు బుధవారం ఉదయం 4 గంటల నుంచి ప్రారంభమయ్యాయి. ఆలయ ప్రధానార్చకుడు భద్రకాళి శేషు ఆధ్వర్యంలో నిర్మాల్య సేవలు అమ్మవారికి ఉద యం నుంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య, పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి, నీలిమా దంపతులు అమ్మవారి సన్నిధిలో జ్యోతిప్రజ్వలనం చేసి ఉత్సవాలు ప్రారంభించారు. ఆలయ మాజీ ధర్మకర్త తొనుపూనూరి వీరన్న అమ్మవారిని దర్శించుకున్నారు.
పంచమూర్తులకు సహస్ర కలశాభిషేకం..
సహస్రకలశాభిషేకం మధ్యాహ్నం ప్రారంభమైంది. అగ్నిపురాణంలో చెప్పినట్లుగా వేదపండితులు నా లుగు వేదాల మూలమంత్రాలు పఠించారు. భక్తులు.. భద్రకాళీ శరణంమమ అంటూ ప్రార్థనలు చే శారు. భద్రకాళి పంచమూర్తులకు, శ్రీచక్రానికి అభిషేకం శోభాయమానంగా జరిగింది. హనుమకొండకు చెందిన బాసాని విశ్వప్రకాశ్, శోభ దపంతులు, డాక్టర్ సాయి విక్షిత్, డాక్టర్ నిహంతి, కావ్యత్, కుంచనకుంట్ల సాంబశివరెడ్డి, వినోద దంపతులు, శ్రీధర్‌రెడ్డి, కీర్తి దంపతులు సహస్రకళశాభిషేకం దాతలుగా వ్యవహరించారు. అనంతరం అమ్మవారిని కాళీక్రమంలో అలంకరించారు. భోగభేరాన్ని కామేశ్వరీనిత్యాక్రమంలో అలంకరించి ఆవరణార్చనలు, సాయంతనపూజ, నీరాజన మంత్రపుష్పం, తీర్థ ప్రసాద వితరణ జరిపారు. భక్తులు అధికసంఖ్యలో పాల్గొన్నారు. భద్రకాళి శరణం మమ అంటూ జయజయధ్వానాలు చేస్తూ పులకించిపోయారు. ఆలయ ఈఓ, అసిస్టెంట్ కమిషనర్ రామల సునీత ఏర్పాట్లు పర్యవేక్షించారు.
శాకంబరీ ఉత్సవాలు ప్రారంభించిన
ఎంపీ కావ్య, ఎమ్మెల్యే నాయిని
శోభాయమానంగా సహస్ర కలశాభిషేకం


