బాధితులను ఆదుకోవడమే మా లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

బాధితులను ఆదుకోవడమే మా లక్ష్యం

Apr 2 2026 7:11 AM | Updated on Apr 2 2026 7:11 AM

ఆపదలో బాధితులను ఆ దుకోవడమే మా లక్ష్యం. కాల్‌ వచ్చిన వెంటనే సాంకేతికత ద్వారా సమాచారం సేకరించి 30 సెకన్లలో అంబులెన్స్‌ను పింపిస్తాం. సకాలంలో ఘటనా స్థలికి చేరుకుని మెరుగైన అత్యవసర వైద్య సేవలు అందిస్తున్నాం.

– శివకుమార్‌, 108 సర్వీస్‌

ఉమ్మడి జిల్లా ప్రోగ్రాం మేనేజర్‌

ప్రతీ కాల్‌ వెనుక ఒక ప్రాణం

12 ఏళ్లుగా 108 సేవల్లో పనిచేస్తున్నా. ప్రతీ కాల్‌ వెనుక ఒక ప్రాణం ఉంటుంది. సమయానికి స్పందించి వారి ప్రాణం కాపాడడం మా బాధ్యత. ఇది ఉద్యోగం కాదు ఒక ప్రాణం కాపాడే పవిత్ర సేవ.

– బొక్క చైతన్య, ఈఎంటీ

సేవలు ప్రశంసనీయం

అత్యవసర పరిస్థితుల్లో గోల్డెన్‌ అవర్‌ చాలా ము ఖ్యమైంది. మా సిబ్బంది 24 గంటలూ పని చేస్తున్నారు. వేసవిని దృష్టిలో ఉంచుకుని ఐస్‌ బాక్సులు, ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు, సైలెన్లు అందుబాటులో ఉంచాం.

వెలుదండి రాము( ఈఎంఈ), 108

జనగామ జిల్లా కోఆర్డినేటర్‌

18 ఏళ్లుగా సేవలు

18 ఏళ్లుగా 108లో సేవలు అందిస్తున్నా. బాధితులను అత్యవసర చికిత్స నిమిత్తం వరంగల్‌కు తీసుకెళ్లే సమయంలో గంటల తరబడి అంబులెన్స్‌లోనే ఉండాల్సి వస్తుంది. ఒక్కోసారి భోజనం చేయడానికి కూడా సమయం దొరకదు. అయినా అవన్నీ లెక్క చేయకుండా బాధితులకు సేవలు అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నాం.

మామిడి రాకేశ్‌,ఈఎంటీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement